Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,470FansLike
57,764FollowersFollow

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు ముందు ఎంత జాగ్రత్తగా భద్రపరచాలో అనేందుకు ఉదాహరణగా నిలిచింది. భారీ నిర్మాణంతో తెరకెక్కిన సినిమా కావడం, విజయ్ పొలిటకల్ ఇష్యూస్ నేపథ్యంలో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పురోగతి సాధించారు. సినిమా లీక్ కు సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు ఎడిటింగ్ లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే లీక్ అయినట్టు అనుమానిస్తున్నారు.

విచారణలో టెక్నికల్ అంశాల ద్వారా నిందితులను ట్రాక్ చేసి గుర్తించారు. ఈక్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక ఒక వ్యవస్థ పని చేసిందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. నిందితులు ఆరుగురిని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు పకడ్బందీగా నిర్వహించి పట్టుకున్నారు. వీరిలో కొందరు టెక్నికల్ గా, మరికొందరు డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో కంటెంట్ అప్‌లోడ్ చేయడంలో నిందితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. లీక్‌కు కారకులు ఎవరు..? నెట్ వర్క్ ఏమైనా ఉందా..? తెర వెనుక సూత్రధారులు ఎవరు? సినిమా ఫైల్ ఎలా బయటకు వెళ్లింది? ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి ఏ ప్లాట్ ఫామ్స్ ఉపయోగించారనే అంశాలపై విచారిస్తున్నారు.

జననాయగన్ సినిమా భారీ అంచనాలతో తెలుగులోవచ్చిన భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కింది. అయితే.. పొలటికల్ అంశాలు, డైలాగ్స్ ఉన్నాయన్న కారణంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు వచ్చాయి. పైగా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు ఆయన చివరి సినిమాగా తెరకెక్కడంతో వార్తల్లో నిలిచింది. దీంతో విడుదల వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పుడు సినిమా లీక్ కావడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాకుండా టీమ్ మొత్తాన్ని కలవరపాటుకు గురి చేసింది. సినిమా విడుదలైనా ఇప్పటికే కంటెంట్ బయటకు వెళ్లిపోవడంతో రిలీజ్ అయ్యాక ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ఎక్కువ చదివినవి

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

Daily Horoscope: కర్కాటక రాశివారికి ఆర్థిక లాభ సూచనలు.. తుల రాశివారికి కొత్త పరిచయాలతో ప్రయోజనం!

మే 13 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈరోజు చంద్రಮಾನ పంచాంగం ప్రకారం గ్రహస్థితుల్లో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని రాశుల వారికి అనుకూల పరిస్థితులు...

Daily Horoscope: మేష రాశివారికి ఆర్థిక లాభం.. కుంభ రాశివారికి కొత్త అవకాశాలు

మే 12 , 2026 మంగళవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగం,...

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...