Switch to English

Bigg Boss Telugu7: వెళ్ళిపోతానంటావేంటి శివాజీ.! కామెడీ కాదు కదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,712FansLike
57,764FollowersFollow

నేను నామినేట్ అయినా ఫర్లేదు. ఏముంది.? బయటకు పంపించేస్తే, వెళ్ళిపోతా.! ఇదీ సినీ నటుడు శివాజీ, బిగ్ బాస్ రియాల్టీ షో ఏడో సీజన్‌లో వ్యవహరిస్తున్న తీరు. శివాజీ మహా నటుడు.! ఆ విషయం అందరికీ తెలుసు. రాజకీయాల్లోనూ బాగానే నటించేశాడు. వెండితెరపై హిట్లు అందుకున్నాడు. రాజకీయాల్లోని నటనకు డిజాస్టర్ రిజల్ట్ చవిచూశాడు. ఇప్పుడేమో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా నటిస్తున్నాడు.

బిగ్ బాస్ హౌస్‌లో ప్రిన్స్ యావర్, తనకు నాలుగు గుడ్లు కావాలని అడిగాడు. కోటా ప్రకారం రెండు గుడ్లు మాత్రమే. బాడీ బిల్డర్ కదా, ప్రొటీన్స్ కోసం రెండు గుడ్లు అదనంగా కావాలన్నది యావర్ డిమాండ్. షకీలా మాత్రం ఒప్పుకోలేదు. అందరికీ ఒకటే రూల్ అని చెప్పిందామె. అక్కడికి శివాజీ వచ్చాడు. ‘నా గుడ్లు తీసేసుకో’ అంటూ త్యాగం చేసేశాడు. ఈ నటనకి అంతా అవాక్కయ్యారు.

హౌస్‌లో దామిని, ప్రియాంక, అమర్ దీప్ తదితరులకు శివాజీ అస్సలు నచ్చడంలేదు. ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేట్ అయ్యాడు కూడా.! నామినేషన్ల పర్వంలోనూ శివాజీ అతి చేశాడు. ఒక్క నామినేషన్‌తో సరిపెట్టాడు. రెండోది చెయ్యమని బిగ్ బాస్ ఆదేశించినా, చెయ్యనన్నాడు.

చివరికి బిగ్ బాస్ ఆదేశంతో, అమర్‌దీప్‌ని నామినేట్ చేయక తప్పలేదు. ఇంత హైడ్రామా ఎందుకు శివాజీ క్రియేట్ చేశాడంటే, ‘మంచోడు’ అనిపించుకోవడానికి. పల్లవి ప్రశాంత్‌ని పలువురు కంటెస్టెంట్లు ‘నటన’ యాంగిల్‌లో నామినేట్ చేస్తే, ఆ ప్రశాంత్‌తో ఆ తర్వాత మాట్లాడుతూ, నిన్ను కార్నర్ చేసేశారంటూ.. చిత్రమైన గేమ్ ప్లే అప్లయ్ చేశాడు శివాజీ.

‘నేను మంచోడ్ని.. నేను మంచోడ్ని..’ అనిపించుకునేందుకు శివాజీ నానా తంటాలూ పడుతన్నాడు. అయినా, ‘నేను బయటకు వెళ్ళిపోవడానికి రెడీ’ అని పదే పదే అంటాడేంటి.? ఆ మాత్రందానికి హౌస్‌లోకి ఎందుకు వచ్చినట్లు.?

ఇక, ఈ వారం హౌస్‌మేట్స్‌ని రెండు గ్రూపులుగా విడదీసిన బిగ్ బాస్, పవరాస్త్ర కోసం ఆ రెండు గ్రూపులూ ఫిజికల్‌గా కష్టపడే టాస్క్ ఇచ్చాడు. అదెవరు గెలుస్తారన్నది రేపు తెలుస్తుంది.

10 COMMENTS

  1. This is an exceptional write-up of content! The author’s comprehensive knowledge of
    the topic is clear throughout the piece. The clear and brief explanations,
    combined with corroborating instances, make challenging ideas
    effortless to understand. I admire the extensive study that
    went into this article, as it provides a solid foundation for the claims presented.
    The author’s writing style is captivating and keeps the viewer engaged until the very
    end. I was amazed by the seamless transition between thoughts and the rational structure of the article.
    The author’s aptitude to present subtle perspectives and
    provide stimulating observations is praiseworthy. It’s
    clear that a lot of work and expertise went into creating
    this remarkable write-up. I warmly urge it to anyone looking for a skillfully written and
    informative piece.

  2. Have you ever considered about including a little bit more
    than just your articles? I mean, what you say is valuable and all.
    But think about if you added some great images or video
    clips to give your posts more, “pop”! Your content is excellent but with images and video
    clips, this site could certainly be one of the greatest in its field.
    Excellent blog!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

Renu Desai: ‘యానిమల్’ పై రేణూ దేశాయ్ పోస్ట్.. కామెంట్స్ సెక్షన్...

Renu Desai: రణబీర్  కపూర్ (Ranbir Kapoor)-రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యానిమల్’...

Manchu Manoj : ఇన్నాళ్లు నాన్నకి ఇప్పుడు నా భార్యకి..!

Manchu Manoj : మంచు మనోజ్‌ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకే సారి ఓటీటీ మరియు థియేటర్ ద్వారా మనోజ్...

రాజకీయం

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ముఖ్యమంత్రుల్ని తయారు చేస్తున్న చంచల్‌గూడా జైలు.!

తెలంగాణలో ఆ జైలుకి ఓ ప్రత్యేకత వుంది. ప్రముఖ కారాగారం అయిన చంచల్‌గూడా, రాజకీయ నిందితులు, నేరస్తులకు కేరాఫ్ అడ్రస్.. అని అంటుంటారు.! నిందితులందరూ నేరస్తులు కాకపోవచ్చనుకోండి.. అది వేరే సంగతి.! అసలు విషయానికొస్తే,...

ఓడిపోయిన జనసేన.! పారిపోయిన వైసీపీ, వైటీపీ.! ఏది పెద్ద అవమానం.!

కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు.. నాయకులూ పోటీకి ‘సై’ అన్నారు.! అధినేత పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్ ఇంకేముంటుంది.? కార్యకర్తలు, నాయకుల కోరికని మన్నించాలి కదా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిందదే.! ఎన్నికల ప్రచారంలో జనసేన...

Revanth Reddy: రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుందా.? ముంచేస్తుందా.?

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన డీకే శివకుమార్ ఏమయ్యారు.? డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి, తెలంగాణలో ఏం జరగబోతోంది.? పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కాంగ్రెస్...

ఎక్కువ చదివినవి

Nithin: ‘నన్ను ఇలా లాక్ చేస్తే ఎలా..?’ నితిన్ హామీపై నాగవంశీ ఫన్నీ ట్వీట్

Nithin: హీరో నితిన్ (Nithin) చాతుర్యానికి నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) షాకయ్యారు. వీరిమధ్య జరిగిన నవ్వులకు నితిన్ కొత్త సినిమా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ (Extra.. Ordinary man)...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 05 డిసెంబర్ 2023

పంచాంగం  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:20 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ అష్టమి రా.10:40 ని.వరకు తదుపరి కార్తీక బహుళ నవమి సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం) నక్షత్రము: పుబ్బ రా.2:37...

Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. సంతోషంగా ఉందంటూ అట్లీ పోస్ట్

Atlee: తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు...

నేరము.! వ్యక్తిగతము.! ఇది వైసీపీ రాజ్యాంగము.!

అమెరికాలో ఓ ఎన్నారై, తన బంధువు అయిన ఓ వ్యక్తి మీద వేధింపులకు పాల్పడ్డాడు.! ఇండియాలోలా కుదరదు కదా.! అక్కడ, ‘వేధింపులకు పాల్పడిన’ వ్యక్తిని అరెస్టు చేసి, లోపలేశారు.! వాడి నుంచి, బాధితుడికి...

Hi Nanna : నాని VS నితిన్‌.. ప్రీ రిలీజ్ లో పై చేయి ఎవరిది?

Hi Nanna : క్రిస్మస్‌ కి రావాలి అనుకున్న నాని హాయ్‌ నాన్న మరియు నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు సలార్‌ కారణంగా రెండు వారాలు ముందుగానే అంటే ఈ వారంలో ప్రేక్షకుల...