స్మాల్ స్క్రీన్ పై వీడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టి ముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ ధనుష్ సపోర్ట్ తో లీడ్ రోల్ ఛాన్స్ అందుకున్నాడు. సినిమా సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ గా ఎదిగాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన అమరన్ సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టాడు శివ కార్తికేయన్. ఆ సినిమాతో అతని రియల్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ అయ్యింది.
అమరన్ తర్వాత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడు శివ కార్తికేయన్. ఈ హీరో ప్రస్తుతం మురుగదాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మురుగదాస్ సినిమా అంటే ఆ రేంజ్ తెలిసిందే. అమరన్ తర్వాత స్టార్ లీగ్ కొనసాగేలా మురుగదాస్ మూవీతో వస్తున్నాడు శివ కార్తికేయన్. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. శివ కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా గ్లింప్స్ వదిలారు.
మదరాసి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ అదిరిపోయింది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా శివ కార్తికేయన్ కు మరోసారి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చేలా ఉంది. ఈ సినిమాతో పాటుగా సుధ కొంగర డైరెక్షన్ లో పరాశక్తి సినిమా చేస్తున్నాడు శివ కార్తికేయన్. ఆ సినిమా కూడా పిరియాడికల్ మూవీగా వస్తుంది. అందులో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. రవి మోహన్, అధర్వ, శ్రీలీల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.