డీజే టిల్లుతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకుని టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తర్వాత అతను చేస్తున్న సినిమా జాక్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిచిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జాక్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు.
జాక్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. అప్పట్లో ఒక టైటిల్ పోస్టర్ వదిలారు. ఇక లేటెస్ట్ గా సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా జాక్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. నరేష్ కొడుకు అయిన సిద్ధు ఏం పనిచేస్తుంటాడో తెలియదు. అది తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోపక్క హీరోయిన్ వైష్ణవి కూడా హీరో ఏం చేస్తాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంతకీ జాక్ ఏం చేస్తాడు..? అతని లక్ష్యం ఏంటి..? తండ్రి చచ్చిపోతానన్నా జాక్ తన లక్ష్యాన్ని ఎందుకు చెప్పడు ..? అన్నది సినిమా కథ. టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సిద్ధు మార్క్ కామెడీ టైమింగ్ ఇంకా ఎంటర్టైనింగ్ మోడ్ లోనే సినిమా ఉండేలా అనిపిస్తుంది.
ఐతే మెయిన్ లైన్ ఏంటన్నది చూపించలేదు కానీ టీజర్ చూశాక సిద్ధు జాక్ మాస్ మహారాజ్ రవితేజ కిక్ సినిమాను పోలినట్టుగా ఉంది. సిద్ధు సరసన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ ఇద్దరు జోడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ జాక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. మరి సిద్ధు జాక్ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.