అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు తాజాగా పెళ్లి పీటలు ఎక్కారు. ఆ మధ్య వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని చాలా రోజులు దాచిపెట్టారు. నెటిజన్లు ప్రశ్నలు కురిపించడంతో చివరకు తామిద్దరం ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు.
అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరిద్దరూ ఒక్కటయ్యారు. మహాసముద్రం సినిమా సమయంలో నుంచే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా రోజులు డేటింగ్ చేశారు వీరిద్దరు. సిద్దార్థ్ కోసం అదితి చెన్నైకి తరచూ వెళ్లి వస్తుండేది. వీరిద్దరూ ముంబైలో కూడా చాలా సార్లు చెక్కర్లు కొట్టింది ఈ జంట. ప్రేమికులుగా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. అయితే వీరిద్దరికీ గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు అయి విడాకులు కూడా అయ్యాయి. అంటే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి అన్నమాట.
సిద్దార్థ్ గతంలో చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. కానీ వారిని ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో సమంతతో కూడా పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ అయ్యాడు. ఇప్పుడు అదితిని మాత్రం పెళ్లి వరకు తీసుకెళ్లాడు. వీరిద్దరికీ ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉంది. అయినా సరే పెళ్లి చేసుకుంది ఈ జంట. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ మళ్లీ సినిమాల్లో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా సిద్దార్థ్ ఇలా మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు ఇటు అదితి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.