Switch to English

శ్యామ్ సింగ రాయ్ మూవీ రివ్యూ

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie శ్యామ్ సింగ రాయ్
Star Cast నాని, సాయి పల్లవి, కృతి శెట్టి
Director రాహుల్ సంకృత్యాన్
Producer వెంకట్ బోయనపల్లి
Music మిక్కీ జే మేయర్
Run Time 2 Hr 37 Mins
Release డిసెంబర్ 24, 2021

న్యాచురల్ స్టార్ నాని నుండి రెండేళ్ల తర్వాత థియేటర్ లో ఒక చిత్రం విడుదలవుతోంది. నాని గత రెండు సినిమాలు ఓటిటిలో సందడి చేసిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేటర్లోనే విడుదల చేస్తానని చెప్పాడు నాని. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

వాసు దేవ్ (నాని)కు దర్శకుడు కావాలన్నది కల. కీర్తి (కృతి)తో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తాడు. అది సక్సెస్ సాధించడంతో ఆమెతోనే సినిమా తీసే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఆ సినిమా కూడా సక్సెస్ సాధించాక వాసు దేవ్ కు అవకాశాలు వెల్లువలా వస్తాయి. అయితే కాపీ రైట్ కేసులో వాసు దేవ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు.

1970లలో శ్యామ్ సింగ రాయ్ కథలను తనకు తెలీకుండానే వాసు సినిమాలుగా మలుస్తుంటాడు. అసలు ఈ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? తనకు వాసు దేవ్ కు ఉన్న సంబంధం ఏంటి? శ్యామ్ వెనుక ఉన్న కథేంటి?

నటీనటులు:

డ్యూయల్ రోల్ లో నాని పెర్ఫార్మన్స్ కు సలాం కొట్టాల్సిందే. శ్యామ్ సింగ రాయ్ వంటి ఛాలెంజింగ్ రోల్ లోనే మెప్పించాడు, ఇక వాసు దేవ్ పాత్ర తనకు నల్లేరు మీద నడకే అయింది. రెండు పాత్రల్లోనూ అదరగొట్టాడు. ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ గెటప్, డైలాగ్ డెలివరీ బాగా సూట్ అయింది. ఆ పాత్రలోని ఇంటెన్సిటీని బాగా క్యారీ చేసాడు.

సాయి పల్లవి మరోసారి ఇంప్రెస్ చేసింది. తన పాత్రను ఎంతో నేర్పుతో పండించింది. ఆమె చార్మ్ మనల్ని ఆకర్షిస్తుంది. ప్రాణవాలయ సాంగ్ లో ఆమె తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో మరోసారి ఇరగదీసింది. గ్లామర్ డాల్ గా కృతి శెట్టి బాగానే చేసింది. మడోన్నా సెబాస్టియన్ కు చిన్న పాత్ర దక్కింది. ఆమె పర్వాలేదు.

సాంకేతిక నిపుణులు:

రాహుల్ సాంకృత్యాన్ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో కథను ఎంచుకుని దాంట్లోకి తెలివిగా కమర్షియల్ అంశాలను చొప్పించాడు. సినిమా మొత్తానికి కోల్కతా నేపధ్యం గుండె వంటిది. అది చాలా బాగా వచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ కథ పరంగా పెద్ద మలుపులు లేకుండా సాగిపోతుంది. అలా అని బోర్ కూడా కొట్టదు. దర్శకుడు కావాలన్న నాని ప్రయత్నాలు. కృతితో లవ్ ట్రాక్ ఇంప్రెస్ చేస్తాయి. సెకండ్ హాఫ్ లోనే అసలైన కథ మొదలవుతుంది.

70లలో ఉన్న సామాజిక సమస్యలను స్పృశిస్తుంది శ్యామ్ సింగ రాయ్. ఆ ట్రాక్ మొత్తం హై ఇంటెన్సిటీతో సాగుతుంది. దేవదాసి వ్యవస్థపై శ్యామ్ సింగ రాయ్ పోరాటాన్ని చాలా చక్కగా చూపించాడు. కాకపోతే సెకండ్ హాఫ్ రెండో హాఫ్ లో కొన్ని డ్రాగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇది టెంపోను కొంత మేర తగ్గిస్తుంది. అలాగే శ్యామ్ సింగ రాయ్ మర్డర్ ప్లాన్ వెనకాల సరైన కారణం కనిపించదు. దాంతో క్లైమాక్స్ వీక్ గా ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో సాంగ్స్ కూడా ఎక్కువ వచ్చిన ఫీలింగ్ వస్తుంది.

మిక్కీ జె మేయర్ పాటలు పర్వాలేదు కానీ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ రేంజ్ లో ఉంది. సాను జాన్ వర్గీస్ కెమెరా పనితనం బ్రిలియంట్. నిర్మాణ విలువలు అదిరిపోయాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • నాని నటన
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

నెగటివ్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో ఎక్కువగా వచ్చే పాటలు
  • శ్యామ్ సింగ రాయ్ మర్డర్ ప్లాన్ కు సరైన కారణం లేకపోవడం
  • సెకండ్ హాఫ్ లో వచ్చే అనవసర సన్నివేశాలు
  • వీక్ క్లైమాక్స్

విశ్లేషణ:

శ్యామ్ సింగ రాయ్ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఆడియన్స్ ను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. మొదటి హాఫ్ సరదాగా సాగిపోతుంది. సినిమాకు కీలకమైన శ్యామ్ సింగ రాయ్ ఎపిసోడ్ నిరాశపరచదు. అయితే సినిమా చివరికి వచ్చేసరికి చాలా డ్రాగ్ సన్నివేశాలు వచ్చి ఇబ్బంది పెడతాయి. క్లైమాక్స్ కూడా వీక్ అయింది. మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ మెప్పించే పీరియడ్ యాక్షన్ డ్రామా.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’...

హీరో సిద్దార్ధ బూతు పైత్యం వెనుక.!

పాపం ‘మహాసముద్రం’ సినిమా దెబ్బకి తన అడ్రస్ సినీ రంగంలో గల్లంతయ్యిందనుకున్నాడో ఏమో, ఆ ఆవేదనలో సోషల్ మీడియా వేదికగా బూతు ట్వీటు ద్వారా పాపులారిటీ పెంచుకునేందుకు ప్రయత్నించి చిక్కుల్ని కొనితెచ్చుకున్నాడు. మొన్నామధ్యన...

జస్ట్ ఆస్కింగ్: బలుపు సినిమా వాళ్ళకా.? రాజకీయ నాయకులకా.?

సినీ పరిశ్రమలో కోట్లు గడించినోళ్ళున్నారు.. పూటగడవనివాళ్ళూ వున్నారు. సినిమా అంటే రంగుల ప్రపంచం. ఎన్నో కష్ట నష్టాలకోర్చి సినీ పరిశ్రమలో కొనసాగేవారు చాలామంది వుంటారు. ఏడాదికి ఎన్ని సినిమాలు తీస్తారు.? అందులో ఎన్ని...

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

ఎక్కువ చదివినవి

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు..! భయాందోళనలకు గురైన ప్రజలు

జనవరి 4, మంగళవారం రాత్రి శ్రీకాకుళంలో స్వల్ప భూప్రకంపనలు జరగడం కలకలం రేపింది. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో వచ్చిన భూప్రకంపనలకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రత్తకన్న, తేలుకుంచి, అమీన్ సాహిబ్ పేట, పురుషోత్తపురం,...

వర్మాయణం.. ఇది బులుగాట కాదు కదా.?

రామ్ గోపాల్ వర్మని చాలామంది పరాన్న జీవిగా అభివరణిస్తారు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ. 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా, జనసేన అధినేత...

దేశంలో కరోనా కల్లోలం..! 24 గంటల్లో లక్షకు పైగా కేసులు

 దేశంలో కోవిడ్ ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. కేవలం 10 రోజుల్లోనే 13 రెట్లు పాజిటివిటీ రేటు పెరిగిపోవడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 1,17,100 మంది కరోనా బారిన పడటం ఇందుకు...

వనమా రాఘవ అరెస్టు..! రామకృష్ణను బెదిరించిన మాట వాస్తవమే: ఏఎస్పీ

సంచలనం సృష్టించిన కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 5రోజులుగా హైదరాబాద్, తొర్రూర్, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో వేర్వేరు సిమ్ కార్డులు...

సంక్రాంతి స్పెషల్: హైదరాబాద్ నుంచి ఏపీకి 1500 బస్సులు

సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఏపీకి అదనపు బస్సులు కేటాయిస్తాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ నుంచి ఏపీకి 1,500 ప్రత్యేక బస్సులు కేటాయించింది టీఎస్ఆర్టీసీ. ఈక్రమంలో...