సీనియర్ హీరోయిన్ శ్రియ అందం రోజురోజుకూ పెరుగుతోంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటి యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాన్ని మెయింటేన్ చేస్తోంది. ఓ పాపకు తల్లి అయినా సరే కుర్ర భామ అన్నట్టుగానే చూపించేస్తోంది ఈ భామ. తెలుగులో శ్రియకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే ఆమె ఏ పోస్టు పెట్టినా సరే ఇట్టే వైరల్ అయిపోతుంది. ఆమె అందాలకు అంత ఫాలోయింగ్ ఉంది మరి. ఇన్నేళ్లు అవుతున్నా సరే ఆమెకు తెలుగులో అవకాశాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ పాత్రలు ఇప్పుడు పెద్దగా రాకపోయినా.. ఏదో ఒక కీలక పాత్ర మాత్రం వస్తోంది.
త్రిబుల్ ఆర్ సినిమాతో మళ్లీ ఆమెకు ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం డీ గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా ఆమె వెనకాడట్లేదు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నా సరే తన ఫ్యామిలీకి సరిపడా టైమ్ ను కేటాయిస్తోంది ఈ భామ. ఇక తాజాగా మరోసారి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఆమె యమ హాట్ గా కనిపిస్తోంది. చూడటానికి పదహారేళ్ల కుర్రదానిలా ఉంది ఈ డ్రెస్సుల్లో. ఇంత ఘాటు అందాలను మెయింటేన్ చేశాక అవకాశాలు రాకుండా ఉంటాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



