ప్రభాస్ సాధారణంగా కెమెరాల ముందుకు రారు. ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే ఆయన దూరంగానే ఉంటారు. అలాంటిది ఆయన ఈ మధ్య జనాల మధ్య ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈటీవీలో వస్తున్న నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా వచ్చిన మూడో ఎపిసోడ్ లో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
శాస్త్రి గారు నాకు చాలా ఇష్టం. ఆయన రాసే ప్రతి పాటలో చాలా లోతైన అర్థం ఉంటుంది. అది మామూలు వాళ్లకు అర్థం కాదు. ముఖ్యంగా జల్సా సినిమాలోని ఛలోరే ఛలోరే ఛల్ పాట అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏ పార్టీకి వెళ్లినా సరే దాని గురించి మాట్లాడుతుంటాను. ఎందుకంటే ఆ పాటలో మన నిజ జీవితాల్లో జరిగే అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి దాన్ని తరచూ వింటూ ఉంటాను. చక్రం సినిమాలో ఆయన రాసిన ‘జగమంత కుటుంబం నాది’ నా ఫేవరెట్. ఆ పాట ఆయన ముందే రాశారు. ఆ పాటను బేస్ చేసుకునే డైరెక్టర్ కృష్ణవంశీ సినిమా కథ రాసుకున్నారు.
నాకు ఆ పాటలో ఉన్న అర్థం చెప్పిన తర్వాత సినిమా కథ చెప్పారు. దాంతో నా మైండ్ పోయింది. ఈ పాటలో ఇంత అర్థం ఉందా అనిపించింది. ఒక రకంగా సిరివెన్నెల గారి పాటలు వినడం ఒక గొప్ప అనుభూతి. మన లైఫ్ స్టైల్ ను ఆయన పాట రూపంలో ఇస్తుంటారు. ఆయన పాటలు రాయడంలో సింహం లాంటి వారు అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.