AP Government: కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు కావొస్తోంది. గత ప్రభుత్వ హయాం నుంచి వ్యవస్థ, పాలనలో ఉన్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తూ వస్తున్న్ కూటమి ప్రభుత్వ తీరుపు ప్రజలు హర్షిస్తున్నారు. కానీ.. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ మాత్రం ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తోంది. దీనికి వైసీపీ సోషల్ మీడియా కీలకంగా వ్యవహరిస్తోంది. రెండు-మూడు నెలలుగా వైసీపీ సోషల్ మీడియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, జీఎస్‌టీ ఆదాయం పడిపోతోందని వైసీపీకి చెందిన పాడ్ కాస్టర్‌లు యూట్యూబర్లు, చేస్తున్న అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ జీఎస్‌టీ అధికారులు అంకెలతో సహా వెల్లడించారు.
- జీఎస్టీ అధికారులు వెల్లడించిన గణాంకాలు పరిశీలిస్తే..
- ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్‌టీ రెవెన్యూ 5 శాతం పెరిగితే.. తెలంగాణలో కేవలం 1శాతం మాత్రమే పెరిగింది.
- గతేడాది ఇదే నెలతో పోల్చితే 5 శాతం వృద్ధి నమోదు చేసింది.
- ఫిబ్రవరిలో జీఎస్టీ కింద తెలంగాణకు రూ.5,280 కోట్లు దక్కితే.. ఏపీకి రూ.3,817 కోట్లు లభించాయి.
అయితే.. దేశంలో అత్యధిక జీఎస్టీ పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, యూపీ, ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీ వెనుకబడినా జీఎస్టీ ఆదాయ పురోభివృద్ధి సాధిస్తోందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ఏపీ జీఎస్టీ ఆదాయం తెలంగాణకు సరిసాటిగా ఉండగా.. 2019-24 మధ్య తగ్గిపోయింది. నాటి జగన్ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు, ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడంతో ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. (కొందరు వైసీపీ నేతలు తీరూ ఇందుకు కారణం కావడంతో జీఎస్టీ ఆదాయం పడిపోయింది).
పేటీఎమ్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న వారంతా కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. 2-3 నెలలుగా జీఎస్టీ ఆదాయం తగ్గింది నిజమే అయినా.. చంద్రబాబు తీసుకుంటున్న చర్యలతో ఏపీ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటోందని ఎకనామిస్టులు అంటున్నారు. అమరావతి, పోలవరం, నిర్మాణ రంగం ఊపందుకుని, కంపెనీలు పెట్టుబడులు పెడితే.. జీఎస్‌టీ వసూళ్లలో ఏపీ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు.
