బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో మిస్టీరియస్ కంటెస్టెంట్ అనే ట్యాగ్ తగిలించుకున్నాడు శివాజీ. బిగ్ హౌస్‌లో పెద్దన్న శివాజీనే.! అందరికీ మంచి చెబుతున్నట్లే నటిస్తూ, తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. కొన్ని వారాలపాటు, భుజం నొప్పితో ‘సంచాలక్’ పాత్రకే పరిమితమైనా, హౌస్‌లో అతనెలా కొనసాగగలుగుతున్నాడన్నది ఓ మిస్టరీ.
తాజా ఎపిసోడ్‌లో రతిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. రతిక – పల్లవి ప్రశాంత్ మధ్య గతంలో రొమాంటిక్ ట్రాక్ నడిచింది. ఆ తర్వాత, ‘అక్క – తమ్ముడు’ అయి కూర్చున్నారు. కానీ, ఆ బాండింగ్ అయితే ఇద్దరి మధ్యా అలాగే వుందని అనుకోవాలి.! పల్లవి ప్రశాంత్ చేతిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వుందాయె.!
నిజానికి, రతిక కోసం ఆ పాస్‌ని పల్లవి ప్రశాంత్ వాడేసి వుండాలి. ఆ పాస్‌ని రతిక తన కోసం వాడమని పల్లవి ప్రశాంత్‌ని అడిగింది కూడా. అయితే, మధ్యలోకి శివాజీ దూరేశాడు. అడుక్కోవడమెందుకు.? ఇక్కడ వుండి ఏం సాధిస్తావ్.? వెళ్ళిపోతే ఏమవుతుంది.? అంటూ రతికని సైడ్ ట్రాక్‌లోకి లాగేశాడు.
ఏ వారం ఎవరు బయటకు వెళ్ళిపోతారో శివాజీకి బాగా తెలుసు. ఆ లెక్కన రతిక ఎలిమినేషన్‌ని శివాజీ ఊహించలేడా.? తెలిసీ, రతికని తెలివిగా బయటకు పంపించేశాడు శివాజీ. నిజానికి, శివాజీకి రతిక ఏమీ పోటీ కాదు.! కానీ, పల్లవి ప్రశాంత్ దగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం శివాజీ ఇలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.
అయినా, బిగ్ హౌస్‌లో అంతా డ్రామానే.! ఎవరికి వారే డ్రామా కింగులు, డ్రామా క్వీన్లు.! కాకపోతే, శివాజీలా మంచి ముహమేసుకుని, కన్నింగ్ వ్యవహారాలు నడపడాన్ని బిగ్ బాస్ వ్యూయర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హోస్ట్ అక్కినేని నాగార్జున నుంచి, బిగ్ బాస్ నిర్వాహకుల నుంచీ శివాజీకి పూర్తి మద్దతు వుంది.
అందుకే, శివాజీ ఫేక్ ఆటలు హౌస్‌లో చెల్లుతున్నాయ్.! ఈ సీజన్ విన్నర్ శివాజీ అని ఫిక్సయిపోవచ్చా.? అంతేనేమో.