సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ భార్య జీవిత డైరెక్ట్ చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దమా.
కథ:
మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ శేఖర్ (రాజశేఖర్) మద్యానికి బానిస కూడా. క్రైమ్ కేసులను తనదైన స్టైల్ లో సాల్వ్ చేస్తుంటాడు. అసలు శేఖర్ ఎందుకు మద్యానికి బానిస అయ్యాడు? తన బ్యాక్ స్టోరీ ఏంటి? తన జీవితంలో కూతురు గీత (శివాని), మాజీ భార్య ఇందు (ఆత్మీయ రాజన్) ఎలాంటి భూమిక పోషిస్తారు వంటి అంశాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు:
తెల్ల జుట్టు, గెడ్డంతో రాజశేఖర్ లుక్ బాగానే ఉంది. ఇక నటన పరంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ఇంటెన్స్ నటనతో పాటు ఎమోషనల్ సీన్స్ లో తన అనుభవాన్ని చూపించాడు.
శివాని శేఖర్ కూతురిగా చిన్న పాత్రలో కనిపించి మెరిసింది. పాత్ర పరిధి తక్కువే అయినా శివాని ఇంప్రెస్ చేస్తుంది. ఆత్మీయ రాజన్ పాత్ర కూడా అంతే. కొన్ని సీన్స్ లోనే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఆమె పాత్ర ఆధారంగానే నడుస్తుంది.
సమీర్, అభినవ్ గోమటం వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు.
సాంకేతిక వర్గం:
అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. మూడు సాంగ్స్ సిట్యువేషనల్ గా వచ్చి ఆకట్టుకుంటాయి. వాటిలో ఫీల్ ఉంది. రాజశేఖర్ కు సాయి కుమార్ డబ్బింగ్ ఎప్పటిలానే పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. మల్లికార్జున నరగని ఫోటోగ్రఫీ యావరేజ్ గా సాగింది. ఇలాంటి జోనర్ లో అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఉన్న చిత్రాలు వస్తున్నాయి. ఎడిటింగ్ నీట్ గా సాగింది. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
మలయాళ చిత్రం జోసెఫ్ కు రీమేక్ అయినా దర్శకురాలు జీవిత తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. అద్భుతం అనలేం కానీ స్క్రీన్ ప్లే పరంగా పర్వాలేదనిపించారు.
పాజిటివ్ పాయింట్స్:
- రాజశేఖర్ నటన
నెగటివ్ పాయింట్స్:
- స్లో ఫస్ట్ హాఫ్
- రెగ్యులర్ కమర్షియల్ ఎలెమెంట్స్ లేకపోవడం
విశ్లేషణ:
మొత్తంగా చూసుకుంటే, శేఖర్ ఒక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ కొంత బెటర్ గా అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ స్లో నెస్, మొత్తంగా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మెయిన్ మైనస్. ఈ సీరియస్ డ్రామాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5