చాలా కాలం తర్వాత ఒక పేరున్న సినిమా విడుదల కాబోతోంది. అటు ఐపీఎల్, ఎన్నికల హడావిడి ముగుస్తోన్న నేపథ్యంలో మే 7న శర్వానంద్ సినిమా మనమే చిత్రం విడుదల కాబోతోంది. శర్వానంద్ కు జంటగా కృతి శెట్టి నటించింది. ప్రమోషన్లు జోరుగానే సాగుతున్నాయి. ఇక ట్రైలర్ కూడా విడుదలైపోయింది. ప్రోమోలు ఆసక్తికరంగానే ఉన్నాయి.
ఇక మనమే చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది. ఈ చిత్రంలో ఏకంగా 16 పాటలు ఉన్నాయిట. ఈ మధ్యకాలంలో తక్కువ పాటలు ట్రెండ్ గా మారింది. సాధారణంగా ఉండే ఆరు పాటలకు భిన్నంగా ఐదు లేదా నాలుగే పాటలు ఉంటున్నాయి.
అయితే మనమే చిత్రంలో మాత్రం ఏకంగా 16 పాటలు ఉన్నాయిట. ఈ మధ్య కాలంలో ఇన్ని పాటలు ఉన్న సినిమా రాలేదు. మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.