Sharukh Khan: అభిమాన హీరోలను చూడటం.. కలుసుకోవడం.. ఒక ఫొటో దిగడం అనేది అభిమానుల కల. ఇందుకు కొందరు కొన్నేళ్లు నిరీక్షిస్తూ ఉంటారు.. మొత్తానికి ఏదొక రోజు తమ కల నెరవేర్చుకుంటారు. అటువంటి కలనే నెరవేర్చుకున్నాడో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అభిమాని. షారుఖ్ ను కలిసేందుకు ఏకంగా 95రోజులు ముంబైలోని హీరో ఇల్లు మన్నత్ ఎదురుగా వేచి చూడటమే ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఈ వార్త అటు బాలీవుడ్ మీడియా, సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఝార్ఖండ్ కు చెందిన ఓ అభిమానికి షారుఖ్ అంటే ఎంతో అభిమానం. దీంతో ఎలాగైనా షారుఖ్ ను కలవాలని అనుకున్నాడు. ముంబై వెళ్లాడు. ఊరు, ఇల్లు, కుటుంబం, ఉద్యోగం వదిలేసి మరీ మన్నత్ దగ్గర 95రోజులు వేచి వున్నాడు. విషయం తెలుసుకున్న షారుఖ్ ఆ అభిమానిని కలిశాడు. ఫొటో దిగి కాసేపు మాట్లాడి సంతోషంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. నువ్వు అదృష్టవంతుడివి అంటూ అభిమానిని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.