పఠాన్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంతోషంలో మునిగిపోయారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇంత ఆనందంలో ఉన్న షారుఖ్ అభిమానులతో #ASKSRK వేదికగా సంభాషించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
‘పఠాన్ హిట్ పాత రోజుల్లోకి తీసుకెళ్లింది. చాలా ఏళ్ల తర్వాత ధియేటర్ కి వచ్చాను. అభిమానుల ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. సినిమా హిట్ అయింది.. ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరని అడుగుతున్నారు.. సింహాలు ఇంటర్వ్యూలు ఇవ్వవు.. నేను అలానే ఇంటర్వ్యూలు ఇవ్వదలచుకోలేదు. జాన్ అబ్రహం బలమైన వ్యక్తి. సినిమాలో అతని పంచుల నుంచి తప్పించుకున్నాను. కలెక్షన్ల లెక్కలు మనం మాట్లాడుకోవడానికే.. నేను ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానాన్ని మాత్రమే లెక్కిస్తున్నాను’.
‘నేను సెక్సీగా ఉన్నానని అంటున్నారు.. అది చూసేవారి కళ్లనుబట్టి ఉంటుంది. జవాన్ లో కూడా నేను ఇంతే ఫిట్ గా కనిపిస్తాను. జీరో సినిమా బాగుందని మీరంటున్నారు.. కానీ, ఆ సినిమాను లక్షల్లోనే వదిలేశారు. పఠాన్ హిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు