Switch to English

కేటీఆర్ చేతుల మీదుగా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,120FansLike
57,764FollowersFollow

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ‘తురుమై వచ్చేయ్..’ లిరికల్ సాంగ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

కేటీఆర్ మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. ఈ సినిమాలోని తురమై వచ్చేయ్ పాట రిలీజ్ చేశాను. ఈ పాట వినగానే నచ్చేలా ఉంది. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – మా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా నుంచి తురుమై వచ్చేయ్ లిరికల్ సాంగ్ ను కేటీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ పాటకు సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమస్యను ఎదిరించే క్రమంలో హీరో ఎలాంటి తెగువ చూపించాడు అనేది ఈ పాటలో ఇన్ స్పైరింగ్ గా తెరకెక్కించారు. అన్నారు.

దర్శకుడు కుమార స్వామి మాట్లాడుతూ – ఎంతో బిజీగా ఉన్నా కేటీఆర్ గారు మాకు టైమ్ ఇచ్చారు. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా నుంచి తురుమై వచ్చేయ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆయనకు మా మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించాం. మా సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అన్నారు.

‘తురుమై వచ్చేయ్..’ పాటకు పసునూరి రవీందర్ లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. ‘తురుమై వచ్చేయ్, మెరుపే తెచ్చెయ్, తొడగొట్టి దమ్ము చూపి దుమ్ములేపెసేయ్, పదునే పెట్టేయ్, కఢరే చూపెయ్, బరిదూకి ధూమ్ తడాఖా ఆట కట్టించెయ్, జనమంతా ఆదరిస్తే, ఏలేటి ఆ గద్దె నీ విద్దె కాదా, పవరుంటె ఎవ్వరైనా తలొంచి నీ చెంత గులాము కారా..’అంటూ నిరాశ నిండిన వారిలో స్ఫూర్తినింపేలా సాగుతుందీ పాట.

19 COMMENTS

సినిమా

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....

Tollywood: డియర్ సెలబ్రిటీస్.. ప్రీ-రిలీజ్ స్టేజీలపై ఎందుకీ అతి?

Tollywood: ఓ సెలబ్రిటీ అత్యుత్సాహంతో మాట్లాడితే కామన్ మ్యాన్ సరదాగా తీసుకుంటాడు. కానీ, అదే కామన్ మ్యాన్ సెలబ్రిటీ అయితే లాజిక్ మర్చిపోతాడు. చుట్టూ జనం, అభిమానుల హోరు. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు....

సినీ పరిశ్రమ అజాతశత్రువు బి.ఎ. రాజు..

తెలుగు సినీ పరిశ్రమలో జర్నలిజం, పబ్లిసిటీ, నిర్మాణ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ సినీ జర్నలిస్ట్ బి.ఎ. రాజు గ 66వ జయంతి ఈ రోజు (జనవరి 7). ఆయన...

సాక్షిపై న్యాయ పోరాటం నుంచి ఎకనామిక్ విజన్ వరకు: లోకేష్ స్పష్టీకరణ

విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని...

మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలతో రాధాకృష్ణ వివాదం

టీవీ చర్చలు, కాలమ్స్‌లో సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ తాజాగా తన ‘కొత్తపలుకు’ కథనంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. ఇటీవల నటుడు...