Switch to English

గ్రాండ్ గా ‘సైతాన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,927FansLike
57,764FollowersFollow

ప్రముఖ దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘సైతాన్’. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ‘మీరు దీనిని నేరం అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటారు’ అనే థీమ్ లో సైతాన్ సాగుతుందని ఆల్రెడీ తెలిపారు. థీమ్ కి తగ్గట్లుగానే ట్రైలర్ కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ తమ మనుగడ కోసం క్రైమ్స్ మొదలు పెట్టింది అనేది ఈ చిత్ర కథ. ఇందులో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటించారు.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. సైతాన్ అనేది క్రైమ్ డ్రామా. ఇంతకు ముందు మేము డిస్ని ప్లస్ హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగెర్స్ కోసం పనిచేశాం. సైతాన్ అనేది కంప్లీట్ గా డిఫెరెంట్ ప్రాజెక్ట్. క్రైమ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే వారి కోసం టార్గెట్ చేసి తెరకెక్కించాం. గతంలో నేను నాలుగైదు చిత్రాలు తెరకెక్కించా. ఏ చిత్రానికి కూడా న్యూడిటీ, అభ్యంతరకర డైలాగ్స్ లాంటి సెన్సార్ సమస్య రాలేదు. కానీ సైతాన్ లో అన్నీ ఉన్నాయి. మీరు ట్రైలర్ చూస్తే.. ఇలాంటి బలమైన కథ చెప్పేందుకు ఆ పదాలు ఉపయోగించాల్సి వచ్చింది.

ఇక మా నటీనటుల గురించి చెప్పాలంటే వారు ఎంతో ఫ్యాషన్ తో వర్క్ చేశారు. ఈ కథకు తగ్గట్లుగా ముందుగానే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళతో కలసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని మహి వి రాఘవ్ అన్నారు.

ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన రిషి మాట్లాడుతూ.. నాకు తెలుగులో ఇదే తొలి ప్రాజెక్ట్. నేను నటించిన కవుల్దారి తెలుగులోకి రీమేక్ అయింది. నాకు తెలుగు ఇండస్ట్రీతో స్పెషల్ రిలేషన్ ఉంది. నాకు ఈ సిరీస్ లో స్ట్రాంగ్ రోల్ ఇచ్చిన మహి వి రాఘవ్ గారికి థ్యాంక్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఆయన అన్ని కోణాల్లో ఇంటెన్స్ గా చూపించారు. సైతాన్ సిరీస్ ఇంటెన్స్ గా, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది.

నటి దేవియాని మాట్లాడుతూ.. ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు మీడియా వాళ్లందరికీ నా థ్యాంక్స్. సేవ్ ది టైగర్స్  తర్వాత తక్కువ సమయంలోనే సైతాన్ రిలీజ్ అవుతోంది. సేవ్ ది టైగర్స్ తరహాలోనే సైతాన్ కూడా ఇంకా భారీ సక్సెస్ అవుతుంది. ఈ సిరీస్ లో నేను ఎంతో కష్టమైన పాత్రలో నటించాను. ఈ అవకాశం ఇచ్చిన మహి వి రాఘవ్ సర్ కి థ్యాంక్స్. జూన్ 15 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో సైతాన్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని కోరింది. జూన్ 15 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో సైతాన్ స్ట్రీమింగ్ మొదలు కానుంది.

సినిమా

ప్రభాస్ ఫౌజీలో అనుపమ్ ఖేర్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ...

త్రివిక్రమ్.. అట్లీ.. ముందు ఎవరితో..?

పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో కూడా ఫ్యాన్స్...

Rashmika: విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ టీజర్ పై రష్మిక పోస్ట్...

Rashmika: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కింగ్ డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ చేయడంతోపాటు టీజర్ కూడా లాంచ్...

ఇట్స్ కాంప్లికేటెడ్ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది : సిద్ధు...

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణ అండ్ హిస్ లీల. ఐదేళ్ల క్రితం 2020 కరోనా టైం లో డైరెక్ట్ ఓటీటీ...

లైలా నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లైలా. షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి...

రాజకీయం

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకారం..!

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్...

ఎట్టకేలకు ’జిత్తులమారి‘ వల్లభనేని వంశీ అరెస్ట్.!

వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజా లో ఆయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది....

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

Andhra Pradesh: రాష్ట్రంలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చొరవ.. ప్రముఖ సంస్థ ఆసక్తి

Andhra Pradesh: రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫార్చూన్ 500 కంపెనీ ‘సిఫీ’కు మంత్రి లోకేష్ ఆహ్వానించిన నేపథ్యంలో సిఫీ...

ఎక్కువ చదివినవి

జాక్ టీజర్.. సిద్ధు మాస్ హంగామా..!

డీజే టిల్లుతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకుని టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్...

లైలా నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లైలా. షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమా నిర్మించారు. ఆకాంక్ష శర్మ...

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్ లో చిరంజీవి

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్‌, దర్శకుడు...

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...