Shahid-Kareena: 18ఏళ్ల క్రితం బాలీవుడ్ క్యూటెస్ట్ లవ్ బర్డ్స్.. తర్వాత విడిపోయి.. విడివిడిగా జీవితాల్లో సెటిల్ అయి.. మళ్లీ ఒక వేదికపై సరదాగ కనిపిస్తే.. స్నేహితులుగా మాట్లాడుకుంటే.. చూసిన అభిమానులకు సంతోషమేగా..! అదే చేశారు షాహిద్ కపూర్-కరీనా కపూర్. ‘జబ్ వి మెట్’, ‘చుప్ చుప్ కే’, ‘ఫిదా’, ‘36 చైనా టౌన్’ సినిమాల్లోనూ కలిసి నటించి ప్రేమికులుగా మారారు.
కానీ, 2007లో విడిపోవడం వారి అభిమానులకు నిరాశ కలిగించింది. అయితే.. ఇన్నేళ్లకు వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై కలుసుకుని, నవ్వుతూ సరదాగా మాట్లాడుకూంటూ కనిపించి సందడి చేశారు. ఐఫా అవార్డులు-2025 ప్రెస్ మీట్లో వీరిద్దరూ పాల్గొన్నారు. పక్కపక్కనే నుంచున్నా తొలుత మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడినట్టే కనిపించారు.
తర్వాత నవ్వుకుంటూ సరాదాగా మాట్లాడుకున్నారు.. హగ్ చేసుకున్నారు.. ఫొటోలు దిగారు. దీంతో మళ్లీ జబ్ వి మెట్ చూస్తున్నట్టుందని నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ‘అప్పుడప్పుడు పలు కార్యక్రమాల్లో మేం కలుస్తూనే ఉంటాం. ప్రేక్షకులకు ఇది ఆనందమిస్తే సంతోషమే’నని షాహిద్ వ్యాఖ్యానించారు.