‘క’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సాధించిన మేకర్స్ నుంచి మరో కొత్త కాన్సెప్ట్ సినిమా రాబోతోంది. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో, చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు వినయ్ రత్నం దర్శకుడు.
వంశి తుమ్మల, సంధ్య వశిష్ట హీరో–హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ గ్లింప్స్‌ను సోమవారం హీరో కార్తీకేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన టీంకు శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ, “యువతరానికి నచ్చే ఫ్రెష్ ఫీల్ ఉన్న సినిమా ఇది. మెల్లకన్ను ఉన్న ఒక యువకుడు ఇన్‌సెక్యూర్‌గా కళ్లద్దాలు వేసుకుని లైఫ్‌ను మేనేజ్ చేస్తుంటాడు. అలాంటి అబ్బాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అన్నది ఫన్ డ్రామా స్టైల్లో చూపించబోతున్నాం. అందమైన గ్రామీణ నేపథ్యంతో ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది” అన్నారు.
