సీనియర్‌ జర్నలిస్ట్‌ వర్సెస్‌ పొలిటికల్‌ అనలిస్ట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,105FansLike
57,764FollowersFollow

ఒకరేమో ఓ ప్రముఖ మీడియా సంస్థలో సీనియర్‌ జర్నలిస్ట్‌. ఇంకొకరేమో, వామపక్ష భావజాలం వున్న పొలిటికల్‌ ఎనలిస్ట్‌. ఇద్దరూ తమ తమ రంగాల్లో ఉద్ధండులే. అయితే, సమస్య ఎక్కడొచ్చిందంటే.. సదరు సీనియర్‌ జర్నలిస్ట్‌, ఓ పార్టీకి మౌత్‌పీస్‌లా మారిపోయారు. తప్పదు మరి, ఈ రోజుల్లో మెజార్టీ మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి మౌత్‌ పీస్‌గా వ్యవహరించకపోతే కష్టం.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

అయినాగానీ, సదరు సీనియర్‌ జర్నలిస్ట్‌కి ఒకప్పుడు చాలా ఫాలోయింగ్‌ వుండేది. చర్చా కార్యక్రమాల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆయన పేరు ప్రఖ్యాతులు గడించారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కారణంగా ఓ ఛానల్‌ నుంచి ఆయనగారు బయటకు వచ్చి, మరో ఛానల్‌లో చేరారో.. అప్పటినుంచి కథ మారిపోయింది. జర్నలిస్ట్‌గా తన సుదీర్ఘ కెరీర్‌లో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్ని పణంగా పెట్టి మరీ, చంద్రబాబు మీద ‘కక్ష’ తీర్చుకుంటున్నారాయన.

నిజానికి, తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడెంత విమర్శలు చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే, ఆల్రెడీ తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీకి ‘సరైన గౌరవమే’ ఇచ్చేశారు ఇటీవలి ఎన్నికల్లో. తెలంగాణలో ఎప్పుడో గల్లంతయిపోయిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక, చంద్రబాబు విషయంలో సదరు సీనియర్‌ జర్నలిస్ట్‌గారి ఆగ్రహావేశాలపై అదే చర్చా కార్యక్రమంలో సీనియర్‌ పొలిటికల్‌ అనలిస్ట్‌ నీళ్ళు చల్లేశారు. చంద్రబాబు హయాంలోనే పోలీసుల్ని అడ్డగోలుగా సొంత అవసరాలకు వాడేసుకున్నారన్నది సీనియర్‌ జర్నలిస్ట్‌ ఆరోపణ.

చంద్రబాబు మాత్రమే కాదు, అంతకు ముందు పాలకులూ అదే పని చేశారు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నది సీనియర్‌ అనలిస్ట్‌ విశ్లేషణ. అధికారులకు బదిలీలుంటాయేమోగానీ.. రాజకీయ నాయకుల్లా ఉద్యోగాలు ఐదేళ్ళకోసారి పోయే పరిస్థితి వుండదు. గతంలో కాంగ్రెస్‌కి తగ్గట్టు పనిచేశారు.. ఆ తర్వాత టీడీపీకి తగ్గట్టు పనిచేవారు. ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్ని ఇది నిష్టుర సత్యం. అధికారుల్ని ఇక్కడ ఏమీ అనలేం.. ఎందుకంటే వారిపై పనిచేసే ఒత్తిళ్ళు అలాంటివి. రేప్పొద్దున్న మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి వుంటే.. అప్పుడు ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా పోలీస్‌ ఉన్నతాధికారులు పనిచేయక తప్పదు.

13 COMMENTS

సినిమా

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌...

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

రాజకీయం

అన్న క్యాంటీన్‌పై వైసీపీ కార్యకర్తల ప్రశంసలు… రాజకీయంగా ఆసక్తికర మలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లపై మరోసారి చర్చ మొదలైంది. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్న ఈ క్యాంటీన్లపై ఈసారి వైసీపీ కార్యకర్తల నుంచే ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది. “అన్న క్యాంటీన్‌లో...

“ప్రభుత్వ స్కూళ్లలో పెద్ద మార్పులు”: మౌలిక సదుపాయాలపై లోకేష్ ఫోకస్

అమరావతిలో జరిగిన సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాల పెంపు, విద్యా నాణ్యతపై కీలక ఆదేశాలు జారీ చేశారు....

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్..

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం సాధారణ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...