Switch to English

టీవీ9 నుంచి రజనీకాంత్‌ ఔట్‌.. ఈ కొత్త గోలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

సినిమా స్టార్లకే కాదు.. న్యూస్‌ ఛానళ్ళలో పనిచేసే సీనియర్‌ జర్నలిస్టులకీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వుంటుందట.! ఇదెక్కడి చోద్యం.! ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. ఫాలోయింగ్‌ మాత్రం కనిపిస్తోంది. ఆ మధ్య వెంకటకృష్ణకి బోల్డంతమంది ఫాలోవర్స్‌ సోషల్‌ మీడియాలో కనిపించారు. మూర్తి అనే మరో సీనియర్‌ జర్నలిస్టు పరిస్థితీ ఇంతే. టీవీ9 రవిప్రకాష్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన కొన్నాళ్ళ క్రితమే టీవీ9 సీఈఓ పదవి నుంచి తొలగించబడ్డా, ఆయనకున్న ఫాలోయింగ్‌ తగ్గలేదు. ‘వియ్‌ సపోర్ట్‌ రవిప్రకాష్‌’ అంటూ రవిప్రకాష్‌ని అభిమానించే చాలామంది సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటారు.

అయితే, ఇదంతా రియల్‌ పాపులారిటీ అనుకుంటే పొరపాటు. ఇదంతా ప్రమోషన్‌ వ్యవహారం అన్నమాట. ఇక, ఇప్పుడు ‘వి సపోర్ట్‌ రజనీకాంత్‌’ అంటున్నారు. దీనిక్కారణం టీవీ9 నుంచి రజనీకాంత్‌ ‘ఔట్‌’ అవబోతున్నారన్న ప్రచారమే. ఇందులో వింతేముంది.. ఓ ఛానల్‌ నుంచి ఇంకో ఛానల్‌కి జర్నలిస్టులు వెళ్ళడం కొత్తేమీ కాదు కదా.!

గతంలో స్వప్న టీవీ9లో వుండేవారు.. ఆ తర్వాత మరో ఛానల్‌ కోసం పనిచేస్తున్నారు. ఇంతకీ, రజనీకాంత్‌ రగడ సంగతేంటి.? అయంటే, ఛానల్‌ యాజమాన్యం ఆయన తీరు పట్ల అంత సంతృప్తిగా లేదట. ఈ క్రమంలో మురళీకృష్ణ అనే మరో సీనియర్‌ జర్నలిస్టుకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారట. రేపో మాపో రజనీకాంత్‌, టీవీ9 నుంచి ఔట్‌ అయిపోతారనీ.. ‘రవిప్రకాష్‌ సన్నిహితుడు’ అనే ఇమేజ్‌ కారణంగానే రజనీకాంత్‌కి ఈ సమస్యలనీ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అసలు కారణం ఇది కాదు.. ఈ మధ్య వైసీపీకీ టీఆర్‌ఎస్‌కీ చెడిన దరిమిలా, వైసీపీ స్టాండ్‌ తీసుకుంటోన్న రజనీకాంత్‌ని సాగనంపాలని యాజమాన్యం నిర్ణయించిందంటూ ఇంకో ప్రచారమూ జరుగుతోంది. కారణం ఏదైతేనేం, ఇప్పుడు రజనీకాంత్‌ మీడియాకి సంబంధించి ‘స్టార్‌ పర్సనాలిటీ’ అనిపించుకుంటున్నారన్నమాట.

సీనియర్‌ జర్నలిస్టులైతే సరిపోరు.. తమను తాము ప్రమోట్‌ చేసుకోవాలంటే, ఇటు మీడియాలోనూ కొంత బలగం వుండాలి.. ఇంకోపక్క సోషల్‌ మీడియాలోనూ తమ పేరు మార్మోగిపోయేలా ప్రచారం చేసుకోగలగాలి. అంతా బాగానే వుందిగానీ, రజనీకాంత్‌ ఔటయిపోయి.. మురళీకృష్ణకి అదనపు పవర్‌ వస్తే.. ఆయన ఎంత కాలం ఆ పవర్‌లో కొనసాగుతారట.? అప్పుడు మళ్ళీ ‘వి సపోర్ట్‌ మురళీకృష్ణ’ అంటూ రచ్చ షురూ అవుతుందేమో.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...