యాక్షన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ రీసెంట్ గా వరస ఫెయిల్యూర్స్ తో సతమతమయ్యాడు. తన సినిమాలు అన్నీ వరసగా ప్లాప్ అవ్వడంతో మార్కెట్ ను కూడా కోల్పోయాడు. అయితే రీసెంట్ గా విడుదలైన సీటిమార్ చిత్రం గోపీచంద్ కు కొంత ఊరటనిచ్చింది. ఈ సినిమా డీసెంట్ రివ్యూలతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే తెచ్చుకుంది.
దీంతో గోపీచంద్ మరింత ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం సీనియర్ హీరో రాజశేఖర్ గోపీచంద్ కు అన్నగా నటించనున్నాడట.
ఈ పాత్ర సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. రాజశేఖర్ కూడా ఎప్పటినుండో మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడానికి సిద్ధమని చెబుతూ వచ్చాడు. శ్రీవాస్ చెప్పిన ఈ స్క్రిప్ట్ నచ్చడంతో ఏ మాత్రం సందేహం లేకుండా ఎస్ అనేసాడట.
1821 373999A quite exciting go by way of, I may not agree completely, but you do make some really legitimate factors. 828839