మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాదిపై SUV దాడి.. చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,219FansLike
57,764FollowersFollow
హైదరాబాద్‌లో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ ఘటనలో సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన నివాసం బయట శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న మొయినుద్దీన్‌పై ఇదే కారణంతో దాడి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం ప్రకారం, ఖాజా మొయినుద్దీన్ ఇంటి బయటకు వచ్చిన సమయంలో వేగంగా వచ్చిన ఓ SUV ఆయనను బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం.

వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణలపై మొయినుద్దీన్ గత కొంతకాలంగా న్యాయపోరాటం కొనసాగిస్తున్నారని, ఇటీవల కొన్ని భూవివాదాలపై ఆయన చురుగ్గా వ్యవహరించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు, సహచర న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో ఉపయోగించిన టయోటా SUV కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనం కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై న్యాయవాదుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

శ్రీసిటీలో లోకేష్ కీలక ప్రకటనలు.. ఏపీకి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా...

Daily Horoscope: మకరం వారికి ఉద్యోగ పురోగతి.. మీనం వారికి ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త

జులై 6 , 2026 సోమవారం రాశిఫలాలు: ఈ రోజు చంద్రಮಾನ పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్యకు ఉపయోగపడే సూచనలను అందిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు...

మంత్రి లోకేష్ తిరుమల పర్యటన.. వరుసగా మూడు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా గడిపారు. ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

సాక్షి కథనంపై సీపీ క్లారిటీ

అద్విక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో ‘బెజవాడ బాస్ భారీ డీల్’ పేరిట సాక్షి పత్రిక ప్రచురించిన కథనాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆ కథనంలో పేర్కొన్న...