Tamannaah: స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah), ఆమె డ్యాన్స్ గురించి తమిళ సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ పై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఇటివల ‘టిస్ట్’ సినిమా తెరకెక్కించారు. జూలై 12న విడుదలైన సినిమా విజయం సాధించింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా ఆయన తమన్నాపై కామెంట్స్ చేశారు..
‘ఈరోజుల్లో సినిమాలో కథ ఉందా లేదా అని ఎవరూ చూడటం లేదు. ఆకర్షణలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఓ సినిమాలో తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు.. కథ అవసరం లేకపోతోంది. తమన్నా డ్యాన్స్ ఉంటే సినిమా హిట్ అయ్యే పరిస్థితులు వచ్చా’యని అన్నారు. పార్తీబన్ చేసిన వ్యాఖ్యలు పలువురు తప్పుబట్టారు. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు.
‘నాకు చిత్ర పరిశ్రమపై, నటీనటులపై గౌరవం ఉంది. ఎవరినీ తక్కువ చేసి చూడాలనే ఉద్దేశం లేదు. నా వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించా’లన్నారు.