బిగ్ బాస్ సందడి రెండో వారానికి చేరుకుంది. ఈ సారి బాగా పాపులర్ కంటెస్టెంట్లు ఎవరూ పెద్దగా ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పాపులర్ గా ఉన్న కొంతమందిని తీసుకొచ్చారు. మొదటి వారం కాస్త పర్వాలేదనిపించినా.. రెండో వారం నుంచే గొడవలు, కొట్లాటలు స్టార్ట్ అయిపోయాయి. మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో విష్ణుప్రియ, కిర్రాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీశెట్టి, నైనిక, శేఖర్ భాషా, ఆదిత్య, నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నారు. ఇందులో పాపులర్ కంటెస్టెంట్లు అయిన విష్ణుప్రియ, నిఖిల్ అందరికన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటున్నారు కాబట్టి సేవ్ అయిపోతున్నారు.
నైనిక, మణికంఠకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. అటు కిర్రాక్ సీత కూడా ఆటతో ఆకట్టుకుంది కాబ్టటి ఆమెకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. ఇక పృథ్వీశెట్టి మొదటి నుంచి అందరితో గొడవ పడుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ కు కావాల్సింది ఇలా గొడవలు పడే కంటెస్టెంట్లే కాబట్టి.. అతన్ని ఇంకొన్నాళ్లు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఎటొచ్చి శేఖర్ భాషా, ఆదిత్యనే మిగిలారు. వీరిద్దరిలో భాషా తన జోకులతో అంతో ఇంతో నవ్విస్తున్నాడు. కానీ ఆదిత్య మాత్రం అసలు బిగ్ బాస్ లో ఉన్నాడా లేడా అన్నట్టే సైలెంట్ గా ఉండిపోతున్నాడు. ఏ మాత్రం ఆట కూడా ఆడట్లేదు.
దాంతో అతన్ని ఎలిమినేట్ చేస్తారని అంతా ఫిక్స్ అవుతున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం.. శేఖర్ భాషాను ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారంట. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఈ వారం అతనికి అసలు ఆట ఆడే ఛాన్స్ కూడా ఇవ్వలేదంట. అతని ప్లేస్ లోకి అవినాష్ లేదంటే రోహిణిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకొచ్చి బిగ్ బాస్ రేటింగ్స్ ఎంతో కొంత పెంచేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే నిజంగా భాషాకు అన్యాయం జరిగినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే భాషా ఎవరి జోలికి పోకుండా అందరితో జోవియల్ గా ఉంటున్నాడు. ఇలాంటి వాళ్లను బయటకు పంపించేసి ట్రెండింగ్ లోకి రావడం బిగ్ బాస్ కు అలవాటే కాబట్టి.. అదే రిపీట్ చేస్తుందని అంటున్నారు.