బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది. అందరూ ఊహించినట్టుగానే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. మరి అతను ఏమీ ఆడలేదా.. హౌస్ లో యాక్టివ్ గా ఉండట్లేదా అంటే అదేం లేదు.. ఆయన తనదైన జోకులతో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. అయినా సరే ఎలిమినేట్ అయిపోయాడు. అయితే అతను బిగ్ బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ వల్లనే ఎలిమినేట్ అయిపోయినట్టు తెలుస్తోంది.
రెండో వారం ఓటింగ్ పరంగా ఇద్దరు కంటెస్టెంట్లు చివరలో ఉన్నారు. అందులో ఆదిత్యం ఓం, శేఖర్ భాషా ఉన్నారు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరిని బయటకు పంపించే అవకాశం ఆడియెన్స్ కు కాకుండా లోపల ఉన్న కంటెస్టెంట్లకు ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో సీత తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ శేఖర్ భాషాను బయటకు పంపించేయాలని నిర్ణయించుకున్నారు. అసలేం చేయకున్నా సరే ఆదిత్య సేవ్ అయిపోయాడు.
శేఖర్ భాషా తనదైన కామెడీతో రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతున్నాడు. అది మిగతా కంటెస్టెంట్లకు నచ్చలేదు. తమకు ఎక్కడ పోటీ వస్తాడో అని ముందే అతన్ని బయటకు పంపించేశారు. ఇక రెండు వారాలకు వారానికి రూ.2.5లక్షల చొప్పున మొత్తం ఐదు లక్షల వరకు తీసుకున్నాడని తెలుస్తోంది. అతను ఆర్జేగా చాలా ఫేమస్ అయ్యాడు. అప్పట్లో లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూలో జోక్యం చేసుకుని బాగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇలా మధ్యలోనే బయటకు వస్తాడని ఎవరూ అనుకోలేదు. మొత్తానికి బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం వల్లే అతనికి అన్యాయం జరిగిందని అంటున్నారు.