School Life: పులివెందుల మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘స్కూల్ లైఫ్’. నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్, క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు సముద్ర చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సావిత్రి కృష్ణ హీరోయిన్.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘సినిమాపై ఇష్టంతో ఇల్లు అమ్మడంతోపాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా తెరకెక్కిస్తున్నా. కంటెంట్ ఉన్న సనిమా. ప్రేక్షకులు కచ్చితంగా సక్సెస్ చేస్తారనే నమ్మకం ఉంది. నన్ను నమ్మిన నిర్మాత రాహుల్ త్రిశూల్ గారికి కృతజ్ఞతలు’లని అన్నారు.
నిర్మాత రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నాకు మూడో సినిమా. యాంకర్ రవితో రాయలసీమ ప్రేమ కథ, ఆర్జీవీ కథను ఓటీటీలో నిర్మించాను. అప్పుడే నాకు మహేశ్ పరిచయం. మహేష్ చెప్పిన కథ నచ్చి సినిమాలో భాగమయ్యాను. కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఆగస్టు రెండున షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో సెప్టెంబర్ రెండున కంప్లీట్ చేస్తున్నా’మని అన్నారు.
