దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI ),సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్.. స్పెషల్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,040 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
* రిలేషన్షిప్ మేనేజర్ – 273 పోస్టులు
* వీపీ వెల్త్ – 643 పోస్టులు
* రిలేషన్షిప్ మేనేజర్ టీం లీడర్ – 32 పోస్టులు
* ఇన్వెస్ట్ మెంట్ స్పెషలిస్ట్ – 30 పోస్టులు
* ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ – 49 పోస్టులు
* మిగిలిన విభాగాల్లో 13 పోస్టులు ఉన్నాయి.
పోస్టును అనుసరించి సీఏ/సీఎఫ్ఏ, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/ సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 750 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా 08.08.2024 తో గడువు ముగుస్తుంది.