కొండా సురేఖ ఉదంతం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఖండిచింది. సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే కొండా సురేఖ కూడా స్పందించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అనుకోకుండా అలాంటి కామెంట్స్ చేశానని.. సమంతకు సారీ చెప్పారు. అయితే ఆమె సారీ చెప్పడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై మరోసారి సీరియస్ అయ్యారు.
అసలు కొండా సురేఖ సమంతకు సారీ చెప్పడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అంత కన్నా స్టుపిడ్ పని ఇంకోటి ఉండదన్నారు. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలలో సమంతను పొగిడారు తప్ప తప్పుపట్టలేదు. కానీ నాగార్జున, చైతన్యను దారునంగా అవమానించినట్టు ఉంది. కాబట్టి సమంతకు సారీ చెప్పడం అర్థం లేదు. అసలు సారీ చెప్పాల్సింది నాగార్జునకు, నాగచైతన్యకు, అక్కినేని ఫ్యామిలీకి. అంతే గానీ.. సమంతను పొగిడి.. మళ్లీ ఆమెకే సారీ చెప్పడం చాలా జుగుప్సాకరంగా ఉందని రామ్ గోపాల్ వర్మ విమర్శించారు.
నాగార్జున, చైతన్యకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా.. మరోసారి ఇలాంటి కామెంట్లు ఎవరూ చేయకుండా గట్టి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇది కేవలం మీ ఫ్యామిలీకి సంబంధించింది మాత్రమే కాదు.. ఇండస్ట్రీ వాళ్లపై ఇంకెవరూ ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఉండాలంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అంటూ రామ్ గోపాల్ వర్మ సీరియస్ గా స్పందించారు.