Switch to English

హోమ్ సినిమా నందు 'సవారి' మూవీ రివ్యూ

నందు ‘సవారి’ మూవీ రివ్యూ

నటీనటులు: నందు, ప్రియాంక శర్మ
నిర్మాత: సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి
దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
మ్యూజిక్: శేఖర్ చంద్ర
ఎడిటర్‌: సంతోష్ మేనం
రన్ టైం: 2 గంటల 22 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 07, 2020

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన యంగ్ హీరో నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన సినిమా ‘సవారి’. యానిమల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాహిత్ మోత్కూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా తెరపై ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం..

కథ:

రాజు(నందు) దగ్గర బాద్ షా అనే ఓ గుఱ్ఱం ఉంటుంది. దానిని సవారీలకి టిప్పుడు లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ ఆ బాద్ షాకి హార్ట్ ప్రాబ్లెమ్ ఉందని తెలుసుకొని ఆపరేషన్ చేయించడం కోసం రాజు డబ్బులు దాస్తూ ఉంటాడు. అదే టైంలో రాజు దూరం నుంచి చూసి ఇష్టపడే ప్రియా(ప్రియాంక శర్మ)తో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ రాజుకి తెచ్చి పెట్టిన ఇబ్బందులేంటి? అసలు ప్రియా ఎవరు? ప్రియా వల్ల రాజుకి ఎలాంటి ఇబ్బందులు కలిగాయి? ఫైనల్ గా రాజు – ప్రియాల ప్రేమ గెలిచిందా? లేదా? అలాగే బాద్ షా ఆపరేషన్ జరిగిందా? లేదా? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

నందు ఇప్పటి వరకు పలు రకాల పాత్రలు చేసాడు, కానీ ఇందులో రాజు గా చేసిన పాత్ర నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్లే పాత్రని చెప్పాలి. దాదాపు డైరెక్టర్ అనుకున్న దానికి పూర్తిగానే న్యాయం చేసాడని చెప్పచ్చు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, నందుకి మాత్రం పేరొస్తుంది. ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ 50-50 అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో బాగా చేస్తే కొన్ని సీన్స్ లో తేలిపోయింది. ఇక శివ ఉన్నంతలో బాగా చేసాడు. మిగతా నటీనటులు జస్ట్ ఓకే.

తెర వెనుక టాలెంట్..

సినిమా మొత్తంగా ది బెస్ట్ అనిపించుకున్న డిపార్ట్మెంట్స్ రెండే రెండు.. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ మరియు శేఖర్ చంద్ర మ్యూజిక్.. వీరి వీరి క్రాఫ్ట్స్ పరంగా ఇద్దరూ పోటీపడి మరీ అదిరిపోయే అవుట్ ఫుట్ ఇచ్చారు. సంతోష్ ఎడిటింగ్ బాగా సాగదీసినట్టు ఉంది. కొన్ని సీన్స్ అవసరం లేకపోయినా సినిమాలో ఉన్నాయి. మొదటి నుంచి చివరిదాకా స్లో గాఉంటుంది.

ఇక స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ అంటూ నాలుగు మేజర్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేసిన సాహిత్ మోత్కూరి కొద్దో గొప్పో డైరెక్టర్ గా పరవాలేధనిపించుకున్నాడే తప్ప మిగిలిన 3 డిపార్ట్ మెంట్స్ లో ఫెయిల్ అయ్యాడు. రొటీన్ ప్రేమ కథలకి గుఱ్ఱాన్ని యాడ్ చేసి చెప్పాడు. స్క్రీన్ ప్లే అయితే పరమ బోరింగ్. డైలాగ్స్ కూడా లైట్. అలాగే సాహిత్ డార్క్ కామెడీ ట్రై చేయాలనే వేలో కథ రాసుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వకపోవడం వలన మూవీ డిజప్పాయింట్ చేస్తుంది.

విజిల్ మోమెంట్స్:

– మోనిష్ భూపతి బ్యూటిఫుల్ విజువల్స్
– శేఖర్ చంద్ర మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– పైవి రెండూ తప్ప మిగతా అన్నీ మైనస్సులే

విశ్లేషణ:

తెలుగులో వచ్చే చాలా సినిమాల్లానే ‘సవారి’ కూడా ట్రైలర్ తో ఆకట్టుకొని థియేటర్ కి ప్రేక్షకులని రప్పించుకొని, వచ్చిన వారిని పూర్తిగా డిజప్పాయింట్ చేసి పంపే సినిమా. ట్రైలర్ లో లానే సినిమాలో ఒక 30 బెస్ట్ సీన్స్ ఉన్నా సినిమా పాస్ అయిపోయేది, కానీ లేవుగా దాంతో ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యింది. ఓవరాల్ గా ఓల్డ్ ఫార్మటు ప్రేమ కథకి గుఱ్ఱం అనే ఎమోషన్ ని యాడ్ చేసి ఇంకా బోరింగ్ గా తీసిన సినిమానే ‘సవారి’.

ఇంటర్వల్ మోమెంట్: అజ్జ బాబోయ్.. ఇంకా సెకండాఫ్ ఉందా.??

ఎండ్ మోమెంట్: థాంక్స్.. ఫినిష్ చేసి మమ్మల్ని వదిలేసినందుకు..

చూడాలా? వద్దా?: లైట్ తీస్కోండి..

బాక్స్ ఆఫీస్ రేంజ్:

ట్రైలర్ బాగుంది అనే ఒక్క కారణం వల్ల రిలీజ్ రోజు ఈ సినిమాకి ఓపెనింగ్స్ బెటర్ గానే వచ్చాయి. కానీ మాట్నీ పూర్తయ్యే టైంకి టాక్ పూర్తిగా బయటకి వెళ్ళాక డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ నుంచి కోలుకోవడం కష్టమే సుమీ.!

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 1.5/5

వెండి తెర

రాజకీయం

ఎక్కువ చదివినవి