రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకుంది. అలాంటి సినిమాలో ఎంతో మంది నటించారు. కానీ ఓ ప్రముఖ నటుడు ఇందులో నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. హీరో సత్యదేవ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. అతను ఈ సినిమాలో 16 నిముషాలు ఉండే పాత్ర చేశాడు. దాదాపు పది రోజుల పాటు షూటింగ్ కు కూడా వెళ్లానని తెలిపాడు.
అయితే అతని పాత్ర ఎడిటింగ్ లో పోయిందంట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సత్యదేవ్. ఎడిటింగ్ లో పోయినా సరే.. ఆ పది రోజులు మూవీకి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందంటూ చెబుతున్నాడు. వాస్తవానికి అంత పెద్ద యాక్టర్ పాత్రను లేపేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే కనీసం అతని పేరును టైటిల్ కార్డ్స్ లో కూడా వేయలేదు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అతను ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ అతని అభిమానులు మాత్రం ఈ విషయంలో కాస్త అంసతృప్తిగానే ఉన్నారు.
ఇక అతను నటించిన జీబ్రా మూవీ ఈ నెల 22న రాబోతోంది. దాని కోసం అతను ప్రమోషన్లు కూడా భారీగానే చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.