‘కింగ్‌డమ్’ వల్ల నాకు చాలా పేరు వచ్చింది: సత్యదేవ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,095FansLike
57,764FollowersFollow

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 31న విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందుతోంది. అన్నదమ్ముల అనుబంధంతో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ చిత్రం వెండితెరపై కొత్త అనుభూతిని కలిగిస్తోంది.

సినిమా విజయంపై సత్యదేవ్ మాట్లాడుతూ – “ఇంత ఫోన్ కాల్స్, మెసేజ్‌లు నాకు ఎప్పుడూ రాలేదు. మొదటి షో నుంచే అందరూ నన్ను అభినందిస్తున్నారు. గౌతమ్ కింగ్‌డమ్ కథ చెప్పగానే ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే అంగీకరించాను. ఆ నమ్మకం ఇప్పుడు నిజమైంది. ‘బ్లఫ్ మాస్టర్’కి నాకు పేరు వచ్చింది కానీ అది నెమ్మదిగా జరిగింది. కానీ ‘కింగ్‌డమ్’ విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో వేగంగా అందరికీ చేరువైంది” అన్నారు.

శివ పాత్ర తన దగ్గరకు ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సత్యదేవ్ – “గౌతమ్ మొదట నుంచే నా పేరే రాసుకున్నారు. కానీ మధ్యలో వేరే నటులను కూడా ఆలోచించారు. చివరకు షూటింగ్‌కు కొద్ది రోజుల ముందు నన్ను కలిశారు. కథ విన్న వెంటనే అంగీకరించాను. గౌతమ్ కూడా ‘శివ పాత్ర కోసం మొదట ఎవరిని అనుకున్నానో వారే చేస్తున్నారు’ అని ఆనందపడ్డారు” అన్నారు.

యాక్షన్ సీన్స్ పై స్పందిస్తూ – “యాక్షన్ సీన్ కి ఎమోషన్ జత అయితేనే అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే నాకు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది” అన్నారు.

సినిమాలో తనకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సీన్ గురించి మాట్లాడుతూ – “విజయ్ నా తమ్ముడు అని తెలిసిన తర్వాత జైలులో జరిగే సీన్ చాలా కష్టంగా అనిపించింది. తమ్ముడంటే మనసులో ప్రేమ ఉన్నా బయటకు చూపించకూడదు. అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఫిజికల్‌గా చాలా కష్టమైనది. కానీ ప్రేక్షకుల స్పందన చూసాక ఆ కష్టం మరిచిపోయాను” అన్నారు.

బోట్ సీక్వెన్స్ గురించి సత్యదేవ్ – “నాకు బోట్ నడపడం రాదు. కానీ విజయ్ నమ్మి బోట్‌లో కూర్చోవాల్సి వచ్చింది. మొదట చాలా భయమేసింది. చిత్రీకరణ సమయంలో కొన్ని ప్రమాదాలు కూడా తప్పించుకున్నాం. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఆ సీన్ చేశాను” అన్నారు.

మురుగన్ పాత్ర పోషించిన వెంకటేష్ గురించి – “విజయ్, నాకు వచ్చినంతే పేరు వెంకటేష్‌కి వచ్చింది. అతను అద్భుతంగా నటించాడు. ఒక కొత్త నటుడికి ఇంత పేరు రావడం గొప్ప విషయం” అన్నారు.

విజయ్ దేవరకొండ గురించి – “విజయ్‌తో నాకు ముందు పరిచయం లేదు. కానీ కలిసిన తర్వాత అతను ఎంత మంచి వ్యక్తి అనేది తెలిసింది. చాలా తక్కువ సమయంలోనే అతనితో అన్నదమ్ముల్లా అనిపించింది. విజయ్ గొప్ప నటుడు కూడా” అని అన్నారు.

నిర్మాత నాగవంశీ గురించి – “వంశీ గారు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. కథ నచ్చితే ఎటువంటి రాజీ పడరు. అందుకే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంత పెద్ద సంస్థగా ఎదిగింది” అని తెలిపారు.

శివ పాత్రకు వచ్చిన పేరు గురించి – “మన నటన మాత్రమే కాదు, ఆ పాత్రను ఎలా రాస్తారన్నది కూడా ముఖ్యం. గౌతమ్ శివ పాత్రను అద్భుతంగా మలిచారు. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రతో కనెక్ట్ అయ్యారు” అని అన్నారు.

తనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ గురించి – “ఒక్కరే కాదు, చాలామంది ఫోన్ చేసి అభినందించారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల నుంచి వచ్చిన కాల్స్ ప్రత్యేకంగా అనిపించాయి” అన్నారు.

తదుపరి ప్రాజెక్టుల గురించి సత్యదేవ్ – “అరేబియన్ కడలి అనే సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ‘ఫుల్ బాటిల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే ‘ఆరంభం’ ఫేమ్ అజయ్ నాగ్‌తో మరో సినిమా చేస్తున్నాను. ఇంకా రెండు సినిమాలు కూడా ఉన్నాయి” అన్నారు.

సినిమా

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

రాజకీయం

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ఎక్కువ చదివినవి

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

పవన్ కళ్యాణ్ సినిమా కోసం సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా?

Pawan Kalyan – Surender Reddy కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పుడు బయటికి వస్తున్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం...

పేరు పైత్యమా! అమరావతికి ‘మావిగన్’ పేరు పెడితే, వైఎస్ జగన్‌కి ఓకేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రతిపాదించారు. అంతకు ముందు చంద్రబాబు...

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే వ్యక్తిపై వేధింపులు, డబ్బుల డిమాండ్ ఆరోపణలతో...

పదవులు కాదు.. పనితీరే కీలకం: లోకేష్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్‌తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు,...