సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాటకు మొదటి రోజున అంత పాజిటివ్ రివ్యూలు రాలేదు. ఈ చిత్రానికి మౌత్ టాక్ కూడా యావరేజ్ గానే వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం సర్కారు వారి పాట నిరుత్సాహపరచలేదు. అలాగని సూపర్బ్ గానూ లేవు. డీసెంట్ గా వస్తున్నాయి. తొలి వీకెండ్ కు ఈ చిత్రం డీసెంట్ గానే పెర్ఫర్మ్ చేసింది.
100 కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్ళింది. యూఎస్ లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ మార్క్ ను టచ్ చేసింది. ఇక తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రానికి కలెక్షన్స్ బాగున్నాయి. మొత్తంగా మొదటి వీకెండ్ లో ఇంప్రెస్ చేసిన సర్కారు వారి పాట వీక్ డేస్ లో ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అన్నదానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంది.