Switch to English

సర్కారు వారి పాట మూవీ రివ్యూ

Critic Rating
( 2.50 )
User Rating
( 2.60 )

No votes so far! Be the first to rate this post.

Movie సర్కారు వారి పాట
Star Cast మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్
Director పరశురాం పెట్ల
Producer నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
Music ఎస్. థమన్
Run Time 2 గం 40 నిమిషాలు
Release 12 మే 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో నటించిన సర్కారు వారి పాట ఈరోజు అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. మరి సర్కారు వారి పాట ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ:

మహేష్ (మహేష్) యూఎస్ లో మనీ లెండింగ్ వ్యాపారం చేస్తుంటాడు. తాను అప్పు ఇచ్చాక దాన్ని పైసాతో సహా వసూలు చేయడం మహేష్ కు అలవాటు. అలాంటి మహేష్ వద్ద నుండి కళావతి (కీర్తి సురేష్) చదువు పేరుతో 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది. తీరా తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు ఇండియా చెక్కేస్తుంది.

తన డబ్బులు వసూలు చేసుకోవడం కోసం ఇండియాలో అడుగుపెట్టిన మహేష్ కు వైజాగ్ లో ఎంపీ రాజేంద్రనాథ్ (సముద్రఖని)తో పెద్ద సమస్యే ఉంటుంది. ఇంతకీ అది ఏంటి? మహేష్ కు రాజేంద్రనాథ్ కు ఉన్న కనెక్షన్ ఏంటి?

నటీనటులు:

మహేష్ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోసాడనే చెప్పాలి. మొదటి నుండి మన దృష్టాంతా మహేష్ మీదే ఉంటుంది. తన స్టైలింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అద్భుతంగా సెట్ అయ్యాయి. పెర్ఫార్మన్స్ పరంగా మహేష్ గురించి చెప్పడానికేముంది. చితక్కొట్టేసాడు. డ్యాన్స్ ల పరంగానూ ఫ్యాన్స్ ను సంతృప్తిపరుస్తాడు.

కీర్తి సురేష్ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించింది. ఇది కొంచెం కొత్తగా బాగుంది. అలాగే మహేష్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. కీర్తి చూడటానికి క్యూట్ గా కూడా ఉంది.

సముద్రఖని పాత్రకు మొదట్లో బిల్డప్ బాగానే ఇచ్చినా తర్వాత వీక్ అయిపోయింది. సుబ్బరాజుకు మరో ముఖ్యమైన పాత్ర దక్కింది. అది పర్వాలేదు. నదియా చిన్న పాత్రలో మెరిసింది. మిగతా వాళ్లంతా మాములే.

సాంకేతిక వర్గం:

మది అందించిన సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఒక వైబ్రంట్ లుక్ ను తీసుకొచ్చాడు. ఎస్ ఎస్ థమన్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీన్స్ ను ఎలివేట్ చేయడానికి బాగానే ఉపయోగపడ్డాయి. సాంగ్స్ కొరియోగ్రఫీ బాగుంది. మహేష్ డ్యాన్స్ లను శేఖర్ మాస్టర్ బాగా డిజైన్ చేసారు. ఇక రామ్ = లక్ష్మణ్ మాస్టర్ ల యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఇంట్రడక్షన్ ఫైట్, బీచ్ ఫైట్ మెప్పిస్తాయి.

నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాకు అనుగుణంగా బాగానే ఖర్చుపెట్టారు. దర్శకుడు పరశురామ్ ఒక బలమైన ఇష్యూను తీసుకుని వీలైనంత కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే ఇందులో సగమే విజయం సాధించాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా పర్వాలేదనిపించిన పరశురామ్, అసలు కథ చెప్పాల్సిన చోట తడబడ్డాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తీవ్రంగా నిరాశపరిచాడు.

పాజిటివ్ పాయింట్స్:

* మహేష్ స్క్రీన్ ప్రెజన్స్

* మ మ మహేశా సాంగ్

* ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎపిసోడ్స్

నెగటివ్ పాయింట్స్:

* సెకండ్ హాఫ్ లో వచ్చే రొటీన్ సీన్స్

* దేశంలోని ఫైనాన్షియల్ సిస్టమ్ పై ఇచ్చిన క్లాస్

చివరిగా:

సర్కారు వారి పాట అనేది మహేష్ బాబు వన్ మ్యాన్ షో. ఇలాంటి పాత్రలో చూడటం ఫ్యాన్స్ కు పండగ లాంటిదే. అయితే మహేష్ ను దాటితే సినిమాలో ఎగ్జైట్ చేసే అంశాలు చాలా తక్కువ. ఇదే హిట్ ను, బ్లాక్ బస్టర్ ను డిసైడ్ చేసేది. కథ పరంగా పరశురామ్ నిరాశపరచగా, మహేష్ ను కొత్తగా ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

అయితే అంచనాలను తగ్గించుకుని సినిమా చూస్తే మాత్రం సర్కారు వారి పాట ఓ మోస్తరుగా మెప్పిస్తుంది.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య రెమ్యునరేషన్ ఎంత?

బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా లో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. బాలరాజు బోడి పాత్రలో కనిపిస్తాడు చైతన్య. తన...

రాశి ఫలాలు: గురువారం 11 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ చతుర్దశి ఉ.9:48 వరకు తదుపరి పౌర్ణమి సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం) నక్షత్రము:ఉత్తరాషాఢ ఉ.7:01 వరకు తదుపరి శ్రవణం...

‘మహేశ్ సహృదయత కలిగిన వ్యక్తి..’ బర్త్ డే విశెష్ చెప్పిన పవన్ కల్యాణ్

సూపర్ స్టార్ మహేశ్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రముఖ కథానాయకులు శ్రీ మహేశ్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

బిగ్ బాస్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబందించిన ప్రోమోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. సీజన్...