సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం మొదటి ఆట నుండే మిక్స్డ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం సర్కారు వారి పాట నిరాశపరచలేదు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ప్రభావాన్ని చూపించింది.
తొలిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సర్కారు వారి పాట 36 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది. ఇది నాన్-ఆర్ ఆర్ ఆర్ రికార్డ్. డివైడ్ టాక్ తో ఈ కలెక్షన్స్ అంటే సూపర్బ్ అనే చెప్పాలి.
పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సముద్రఖని విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.