నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డు అందుకుంది. ఈ సినిమా గత నెలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది. ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కించారు. నాని, ఆత్రేయ కాంబోలో ఇది రెండో సినిమా అనే చెప్పుకోవాలి. వీరిద్దరి కాంబినేషన్ కు మంచి పేరుంది. అందుకే సినిమాకు విపరీతమైన బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ కూడా వచ్చింది.
నాని యాక్షన్ సీన్లతో అదరగొట్టాడని అంటున్నారు. అంతే కాకుండా విలన్ పాత్రలో ఎస్ జే సూర్య బీభత్సం సృష్టించాడని టాక్ వినిపిస్తోంది. ఇక థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ.. త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.40 కోట్లకు ఓటీటీ హక్కులను ఈ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం సరిపోదా శనివారం ఓటీటీలో సెప్టెంబర్ 26న రిలీజ్ కాబోతోందంట. ఇంత భారీ ధర పెట్టి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తోంది.
ఇక జియో సినిమాలో హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అంటే రెండు ఓటీటీల్లో కలిపి ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా భారీగానే కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. నాని సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో ఓటీటీ రైట్స్ రావడం బహుషా ఇదే మొదటి సారి కావచ్చని అంటున్నారు.