Sankranthiki vasthunnam: ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేశ్ సాధించిన విజయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తి.. పాటలు, కామెడీతో అలరించింది. తెలుగులోనే విడుదలై.. 300కోట్ల కలెక్షన్లతో ఔరా అనిపించింది. ఇక సినిమాకు అసలైన బజ్ తీసుకొచ్చింది భీమ్స్ సంగీతంలో వచ్చిన ‘గోదారీ గట్టు మీద రామచిలక..’ పాటే.
గతంలో యునిక్ వాయిస్ తో అలరించిన రమణ గోగులతో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాట పాడించి నేటి తరానికి ఆ మ్యాజిక్ చూపించారు. దీంతో సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడా లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 200మిలియన్ వ్యూస్ దాటేసి మరో రికార్డు సృష్టించింది.
ఇక ఓటీటీలోకి రావడం రావడమే వండర్స్ క్రియేట్ చేసింది. 12గంటల్లోనే 100మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించి.. ప్రస్తుతం 300మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడో సినిమా 4వారాలు ఆడటం గొప్ప విషయం. అటువంటిది సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా 92కేంద్రాల్లో 50రోజులు రన్ పూర్తి చేసుకుని మరో అద్భుతమే చేసింది.