విక్టరీ వెంకటేశ్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అన్ని ఏరియాల్లో హిట్ టాక్ తో దూసుకుపోయింది ఈ సినిమా. దిల్ రాజు నిర్మాణ సంస్థలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇప్పటికే ఈ మూవీ రూ.300 కోట్ల కలెక్షన్లు దాటిపోయింది. థియేటర్లలో ఇంకా ఆడుతుండగానే ఈ మూవీ ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులను అమ్మేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 ఈ మూవీ హక్కులను దక్కించుకుంది.
శాలిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని జీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. రేపు తండేల్ సినిమా రాబోతోంది. కాబట్టి ఆ మూవీ ఫలితాన్ని బట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కలెక్షన్లు తగ్గుతాయా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటు అనిల్ రావిపూడికి కూడా మంచి బూస్ట్ ఇచ్చింది ఈ సినిమా. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా కామెడీ పరంగా అలరిస్తోంది.