Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. టైటిల్ నుంచే బజ్ క్రియేట్ చేసిన సినిమా ప్రమోషన్లతోనూ అదరగొట్టి ప్రేక్షకుల అటెన్షన్ తెచ్చుకుంది. భీమ్స్ సంగీతంలోని పాటలు కూడా హిట్టవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నిన్న రిలీజ్ అయిన సినిమాకు భారీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
దీంతో వెంకటేశ్ కెరీర్లోనే తొలిరోజు వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిందని.. ఓవర్సీస్ లో ఏకంగా 5లక్షల డాలర్ల కలెక్షన్లు రాబట్టినట్టు టీమ్ ప్రకటించింది. వీకెండ్ కలసివస్తూండటంతో సినిమా అతి త్వరలోనే 1మిలియన్ క్లబ్ లో జాయిన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా హౌస్ ఫుల్స్ తో సినిమా రన్ అవుతోంది.
వెంకటేశ్ మార్క్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లేతో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోందని చెప్పాలి. వెంకటేశ్ కు జతగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కింది.