సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్, బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో డాకూ మహారాజ్, వెంకీ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు ప్రమోషన్ల విషయంలో ఒకేలా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి కానీ.. హీరోలు మాత్రం మీడియా ముందుకు రావట్లేదు. ఏదైనా ప్రోగ్రామ్ లకు అటెండ్ అవుతున్నారే తప్ప.. మీడియా ముందుకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. రామ్ చరణ్ కేవలం ఈవెంట్ లకు మాత్రమే వచ్చాడు.
బాలయ్య కూడా అంతే. అటు సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో వెంకీ ప్రమోషన్లలో పాల్గొన్నాడు తప్ప మీడియా ముందుకు రాలేదు. కేవలం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. మీడియా ప్రశ్నలను ఎదుర్కునేందుకు వారు మొహమాట పడ్డారేమో అనిపిస్తుంది. పుష్ప-2 సమయంలో సంధ్య థియేటర్ ఘటన, తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించడం లాంటి వాటిపై ప్రశ్నలు వస్తాయని వారు దూరంగా ఉన్నారేమో అనే ప్రచారం కూడా జరిగింది. ఇంకొన్ని సార్లు తెలుగులో ప్రమోషన్లు పెద్దగా అవసరం లేదని బాలయ్య, వెంకీ భావించారేమో అనిపిస్తోంది.
రామ్ చరణ్ తెలుగుతో పాటు ముంబై ఇతర రాష్ట్రాల్లో ప్రమోషన్లు చేశారు. కానీ అక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు. మొత్తంగా హీరోలు సేఫ్ జోన్ లోనే ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.