ఇండియన్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. టెన్నిస్ ను అత్యున్నత శిఖరాలకు తీసుకు వెళ్లిన సానియా మీర్జా ఇప్పుడు చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆట తో పాటు అందం కూడా టెన్నిస్ కు అద్దిన సానియా మీర్జా వల్ల ఇండియాలో టెన్నిస్ కు మంచి ఆధరణ దక్కింది అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా టెన్నిస్ ను ఆడుతున్న సానియా మీర్జా బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆట ఆడుతూ ఎన్నో విజయాలను ఇండియాకు అందించింది. అత్యున్నత విజయాలను దక్కించుకుది దేశం గర్వించదగ్గ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచిన సానియా మీర్జా ఇప్పుడు తన ఆటకు స్వస్థి పలక బోతున్నట్లుగా ప్రకటించింది.
తాను ఇకపై ఆడలేను అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. శరీరం సహకరించక పోవడం వల్లే తాను ఆటకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ లో సానియా మీర్జా ఆడుతోంది. వచ్చే ఏడాది జరుగబోతున్న టోర్నమెంట్ తర్వాత ఆటకు పూర్తిగా ఈమె దూరం అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తానీ క్రికెటర్ ను వివాహం చేసుకున్నా కూడా ఇండియాలోనే ఉంటున్న సానియా ఆటకు గుడ్ బై చెప్పిన తర్వాత మకాం పాకిస్తాన్ కు మార్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
Great work! This is the type of information that are supposed to be shared across the net.
Shame on Google for not positioning this post higher!
Come on over and visit my web site . Thank you =)