Sandeep Reddy Vanga: దేశవ్యాప్తంగా ప్రస్తుతం బజ్ క్రియేట్ అయిన సినిమా ‘యానిమల్’ (Animal). రణబీర్ కపూర్ (Ranabeer Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సందీప్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈక్రమంలో.. యానిమల్ మొదట మహేశ్ (Mahesh) కు చెప్పారని కానీ.. వర్కౌట్ కాలేదనే వార్తలపై ఆయన స్పందించారు.
‘యానిమల్ కథ మహేశ్ కు చెప్పలేదు. డెవిల్ అనే కథ చెప్పాను. అయితే.. ఈ రెండు కథలు కొంచెం ఒకేలా ఉంటాయి. కొన్ని కారణాల వల్ల మహేశ్ తో సినిమా తెరకెక్కలేదు. యానిమల్ కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇప్పటి వరకూ చూసిన హింస కంటే మరింత ఎక్కువగా సినిమాలో ఉంటుంద’ని అన్నారు.
ఇటివల .. ‘మహేశ్, రామ్ చరణ్ తో సినిమాలు చేయాలనుంది. అయితే.. మహేశ్ కు కథ చెప్పా. కానీ.. వర్కౌట్ అవలేద’ని అన్నారు. దీంతో యానిమల్ స్టోరీనే మహేశ్ చెప్పగా.. రిజెక్ట్ చేశారనే వార్తలపై ఆయ న క్లారిటీ ఇచ్చారు.