సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్లలో ఓ సెన్సేషన్. తీసింది రెండే సినిమాలు అయినా.. ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆయన తీసే సినిమాలకు ఓ సెపరేట్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఆ సినిమాల తర్వాత సందీప్ ఏం మాట్లాడినా.. చివరకు ఏం పోస్టు పెట్టినా సరే నెట్టింట్లో సెన్సేషన్ అవుతోంది. తాజాగా అతను తన భద్రకాళి ఆఫీస్ ఫొటోలను పోస్టు చేశాడు. తన ఆఫీస్ లో చిరంజీవి ఫ్రేమ్ చేయించుకుని పెట్టుకున్నాడు. ఆ ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్త చర్చకు దారి తీసింది.
చిరంజీవికి సందీప్ రెడ్డి పెద్ద ఫ్యాన్. ఆయన మీద అభిమానంతో ఆరాధన సినిమాలోని ఓ స్టిల్ ను ఫ్రేమగా చేయించుకున్నాడు. ఆ పిక్ లో చిరంజీవి పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దాంతో అసలు ఆ సినిమా ఏంటి అని సోషల్ మీడియాలో వెతకడం స్టార్ట్ చేశారు ప్రేక్షకులు. ఆరాధన సినిమా గురించి తెలియని ఇప్పటి జనరేషన్ కూడా ఆ మూవీని యూట్యూబ్ లో వెతుకుతున్నారు. పైగా సందీప్ పెట్టిన పిక్ ఏ సీన్ కు సంబంధించింది అని సెర్చ్ చేసి మరీ చూడటంతో ఆ సీన్ కు మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి.
ఒక్క పోస్టుతో ఎప్పుడో వచ్చిన ఆరాధన సినిమా ఇప్పుడు తెరమీదకు తెచ్చాడు సందీప్. దెబ్బకు సోషల్ మీడియాలో సందీప్ పోస్టు వైరల్ గా మారిపోయింది.