పూరీ జగన్నాథ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. వరుస డిజాస్టర్లతో ఆయన కెరీర్ డైలమాలో పడిపోయింది. అర్జెంటుగా ఒక హిట్ పడకపోతే మాత్రం ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా తీశాడు. కానీ లైగర్ మూవీ తీవ్ర విమర్శల పాలు అయింది. ఆ సినిమా అనుకున్న దాంట్లో సగం కూడా రాబట్టలేకపోయింది. దాని తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో హీరో రామ్ తో హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ తీశాడు. డబుల్ ఇస్మార్ట్ కూడా అట్టర్ ప్లాప్ అయింది.
దాంతో మళ్లీ చేతులు కాల్చుకున్నాడు పూరీ జగన్నాథ్. దీంతో ఆయనకు పెద్ద హీరోలు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. దాంతో ఈ సారి ఆయన హీరో సందీప్ కిషన్ తో సినిమా తీయబోతున్నాడంట. సందీప్ కూడా వరుసగా సినిమాలు తీస్తున్నా ఆయనకు హిట్లు పడట్లేదు. దాంతో సందీప్ కిషన్ మేనమామ శ్యామ్ కె నాయుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆయన తన స్నేహితుడు అయిన పూరీ జగన్నాథ్ ను ఒప్పిస్తున్నాడంట. సందీప్ కిషన్ తో సినిమా తీసేందుకు పూరీ కూడా రెడీ అవుతున్నాడంట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాతో అయినా పూరీ గాడిలో పడుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆయన అభిమానులు మాత్రం కమ్ బ్యాక్ పూరీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.