Majaka: సందీప్ కిషన్-రీతూ వర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘మజాకా’. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన సినిమాను ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదవుతున్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
సందీప్ కిషన్.. ‘ఇది నా 30వ సినిమా. భైరవకోన, రాయన్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ప్రేక్షకులు నా నుంచి కోరుకునే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మజాకా’. ‘మేము వయసుకు వచ్చాం’ సినిమా చూసినప్పటినుంచి త్రినాధ్ గారితో పని చేయాలనుకున్నా. ఇప్పటికి కుదిరింది. కుటుంబ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా ఇది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముంద’ని అన్నారు.
త్రినాథ్ నక్కిన.. ‘మజాకా’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సందీప్ నా అంచనాలకు మించి నటించారు. సినిమాలో ఎమోషన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. మన్మధుడు తర్వాత అన్షు నటించిన సినిమా. తన పాత్ర చాలా బాగుంటుంది. రీతు వర్మ చక్కగా నటించింది. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంద’ని అన్నారు.
తండ్రీ-కొడుకుల మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయని.. ప్రేక్షకులకు నచ్చుతాయని రావు రమేశ్, రైటర్ ప్రసన్న, నిర్మాత రాజేశ్ అన్నారు. టెక్నీషియన్స్ అందరూ కష్టపడి పని చేశారని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని అన్నారు.