Switch to English

సమ్మతమే మూవీ రివ్యూ – అక్కడక్కడా మెరుపులు మాత్రమే

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

Movie సమ్మతమే
Star Cast కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి
Director గోపీనాథ్ రెడ్డి
Producer ప్రవీణ కనకాల
Music శేఖర్ చంద్ర
Run Time 2గం 10 నిమి
Release 24 జూన్, 2022

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం సమ్మతమే. సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో మరి చూద్దామా?

కథ:

కృష్ణ (కిరణ్ అబ్బవరం)కు చిన్నప్పటి నుండి పెళ్లి అంటే అమితాసక్తి. దాని పట్ల ఒక ఫాంటసీ. అలాంటి కృష్ణకు శాన్వి (చాందిని చౌదరి)తో పెళ్లి నిశ్చయమవుతుంది. కృష్ణకు శాన్విపై మొదట అంత మంచి అభిప్రాయం ఉండదు. కానీ క్రమంగా తనతో ట్రావెల్ చేసే క్రమంలో తనను ఇష్టపడతాడు.

మరి శాన్వికి తన ప్రేమను కృష్ణ వ్యక్తపరిచాడా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? చివరికి వాటిని ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళ కథ ఏమైంది అన్నది చిత్ర కథ.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం మరోసారి డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకూ తనలో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తోంది. చాందిని చౌదరి కూడా చక్కగా నటించింది. ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునే స్థాయిలో ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ బాగా చేసారు.

ఇక కమెడియన్ సప్తగిరి చిన్న పాత్రలో మెరిశాడు. తను ఉన్నంత సేపూ థియేటర్లో నవ్వులు పూస్తాయి. అలాగే ఈ చిత్రంలో నటించిన మిగిలిన వాళ్ళు కూడా తమ పరిధుల మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు:

శేఖర్ చంద్ర సంగీతం ఆకట్టుకుంది. కొన్ని పాటలు అయితే రిపీట్ లో మెప్పిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నచ్చే స్థాయిలోనే ఉంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సన్నివేశాల్లో శేఖర్ చంద్ర పనితనం బాగుంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా సాగింది. ఎడిటింగ్ కూడా అంతే.

ఇక దర్శకుడు గోపినాథ్ రెడ్డి, తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. అయితే స్క్రీన్ ప్లే లో చాలా లోపాలున్నాయి. చాలా సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. ఇక్కడే చిత్రం గాడి తప్పింది.

పాజిటివ్ పాయింట్స్:

  • కిరణ్, చాందిని
  • రొమాంటిక్ సన్నివేశాలు

నెగటివ్ పాయింట్స్:

  • నరేషన్
  • కథనం

చివరిగా:

లీడ్ పెయిర్ ఆకట్టుకునే సమ్మతమే ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ అన్న ఫీలింగ్ మొదట్లో కలిగించినా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా పేలవంగా ముగుస్తుంది.

తెలుగు బులెటిన్  రేటింగ్: 2/5

9 COMMENTS

  1. Hey I am so thrilled I found your weblog, I really found you by accident, while I was browsing on Yahoo for something else, Anyways I am here now and would just like to say thanks for a tremendous post and a all round entertaining blog (I also love the theme/design), I don’t have time to browse it all at the moment but I have book-marked it and also added in your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the fantastic jo.|

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈరోజే విడుదలైన ఈ...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఏడ్చేసిన గీతూ రాయల్… ఫైర్ అయిన షన్ను ఫ్యాన్స్!

బాడీ షేమింగ్ అనేది ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. తమ జీవితాల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా గళం విప్పుతున్నారు. ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది...

డీజే టిల్లు2లో ఈ మల్లు బ్యూటీ?

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్బ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ...

కేవలం ఆమిర్ కోసమే లాల్ సింగ్ చడ్డాను ప్రమోట్ చేస్తున్నా – చిరు

ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా ఆగస్ట్ 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. హిందీతో పాటు తెలుగులో కూడా...