టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి హైలైట్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న సమంత ఇప్పుడు దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడంతో ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సమయంలో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారితీసింది. ఈ నేపథ్యంలో సమంత ఆస్తులు, ఆదాయం, వ్యాపారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
టాలీవుడ్‌లో 15 ఏళ్లుగా స్టార్ డమ్‌ను ఆస్వాదిస్తున్న సమంత, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఒక్క సినిమాకు 10 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్. ‘పుష్ప’ సినిమాలో “ఊ అంటావా” గీతం కోసం ఆమె 5 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా ఆమె భారీగా సంపాదిస్తోంది. సామ్‌సంగ్, డ్రూల్స్, డ్రీమ్11, టామీ హిల్ఫిగర్ వంటి బ్రాండ్ల ప్రమోషన్ల ద్వారా దాదాపు 10 కోట్ల వరకు ఆమె ఆదాయం పొందినట్టు తెలుస్తోంది.
అనారోగ్య కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయింది. నిర్మాతగా కూడా అడుగుపెట్టి ‘శుభం’ వంటి సినిమాలతో మంచి లాభాలు అందుకుంది. ఇంకా రియల్ ఎస్టేట్, బ్యూటీ మరియు ఫ్యాషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి తన ఆర్థిక స్థితిని మరింత పెంచుకుంది. హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో ఆమె లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. సముద్రతీర ప్రాంతంలో ఉన్న సీఫేస్ హౌస్ విలువ మాత్రమే 15 కోట్లకు పైగానే ఉందని సమాచారం. డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌తో పాటు మరో 8 కోట్ల ఇల్లు కూడా ఆమె పేరుపై ఉంది.
అంతే కాదు, సమంత గ్యారేజ్‌లో BMW 7-సిరీస్, జాగ్వార్ XF, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ G63 AMG వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. టాలీవుడ్‌లో లగ్జరీ లైఫ్‌స్టైల్ అనేసరికి సమంత పేరు ముందుంటుంది. వ్యాపార రంగంలోనూ ఆమె దూసుకుపోతోంది. ‘సాకీ’ ఫ్యాషన్ బ్రాండ్‌ను విజయవంతంగా నడిపిస్తూ, ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. ‘ట్రూలీ స్మా’ పేరుతో కొత్త ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించింది.
సమంత మొత్తం ఆస్తులు సుమారు ₹200 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. రాజ్ నిడిమోరుతో పోలిస్తే సమంతే ఎక్కువ ఆస్తులు కలిగి ఉందన్న చర్చలు కూడా టాలీవుడ్‌లో జోరుగా సాగుతున్నాయి. కెరీర్‌లో మాత్రమే కాదు, వ్యాపారాల్లో కూడా దూకుడు చూపిస్తూ స్టార్‌గా, మహిళా పారిశ్రామికవేత్తగా సమంత మరోసారి తన సత్తా చాటుతోంది.
