| Firstname | |
|---|---|
| Movie Name | |
| Star Cast | |
| Director | |
| Producer | |
| Run Time | |
| Release Date | |

అనసూయ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు సోషల్ మీడియాలో హాటెస్ట్ ట్రోలింగ్ సమంత అక్కినేని మీద జరుగుతోంది. సమంత, ఆమె భర్త అక్కినేని నాగ చైతన్య విదేశాల్లో హాలీడేయింగ్‌లో బిజీగా వున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య తీసిన ఓ ఫొటోని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే, ఆ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘సమంత.. మరీ ఇంత హాట్‌గానా.?’ అటూ హేటర్స్ తమదైన స్టయిల్లో ట్రోలింగ్ షురూ చేసేశారు.
‘పెళ్ళయ్యింది కదా.. నీకెందుకు గ్లామర్.?’ అన్నది చాలామంది నుంచి కామన్‌గా వస్తోన్న ప్రశ్న. అఫ్‌కోర్స్, ఇలాంటి ప్రశ్నలకు సమంత ఎప్పుడో ఘాటైన సమాధానమిచ్చేసిందనుకోండి.. అది వేరే విషయం. మళ్ళీ ఇంకోసారి సమంత, తన మీద జరుగుతున్న ట్రోలింగ్‌పై స్పందించాల్సి వచ్చేలా వుంది. ఆ స్థాయిలో ఆమెకు వ్యతిరేకంగా ట్రోలింగ్ జరుగుతోంది మరి. ప్రస్తుతం సమంత చేతిలో ఓ సినిమా వుంది. అదే ’96’ రీమేక్. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో.
సినిమాల సంగతి పక్కన పెడితే, సమంతకి ఫిట్‌నెస్ మీద అవగాహన ఎక్కువ. ఫిట్‌నెస్ పేరుతో చాలా చాలా చేస్తుంటుంది. అలా చేసిన వర్కవుట్స్‌లో కొన్నిటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఫాలోవర్స్‌కి బోల్డంత కంటెంట్ అందిస్తుంటుంది. ఇవే కాదు, సేవా కార్యక్రమాలు.. వగైరాలూ మామూలే. ఇటీవలి కాలంలో వరుస హిట్స్ దక్కించుకున్న సమంత, దురదృష్టవశాత్తూ ‘మన్మథుడు-2’ సినిమాతో ఫెయిల్యూర్ చూసిన విషయం విదితమే. అయితే, ఆ సినిమాలో ఆమెది జస్ట్ అతిథి పాత్ర మాత్రమే.
