ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. అప్పుడే పుష్పగాడి జాతర మొదలైంది. ప్రమోషన్లతో అల్లు అర్జున్ అదరగొడుతున్నాడు. ఓ వైపు ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉందని చెబుతున్నారు. ఇంకోవైపు ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసేశారు. ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట సుకుమార్. ఈ సాంగ్ లో శ్రీలీలను తీసుకున్నారు. మొదట్లో శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని అనుకున్నా.. ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో చివరకు శ్రీలీలను తీసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ వైరల్ అవుతోంది.
కానీ సమంత పార్టు-1కు చేసినప్పుడు వచ్చినంత హైప్ అయితే రావట్లేదు. దీంతో శ్రీలీలకు సమంత ఫ్యాన్స్ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే పార్టు-1లో సమంత చేసిన ఐటెం సాంగ్ భారీ హిట్ అయింది. దాంతోనే భారీ బజ్ వచ్చింది. కాబట్టి ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ మీద బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. అందుకే శ్రీలీల ఇప్పుడు తన డ్యాన్స్, పర్ఫార్మెన్స్, అందంతో సమంతను బీట్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సరే సమంతతో పోల్చి ఆమె ఫ్యాన్స్ ఏకి పారేయడం గ్యారెంటీ. ఇప్పటికే శ్రీలీల మీద కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి.
సమంత రేంజ్ లో కాకపోయినా శ్రీలీలకు కూడా యూత్ లో బాగానే ఫాలోయింగ్ ఉంది. పైగా ఐటెం సాంగ్ కోసం తన అందాలను ఆరబోయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక ఆమె డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి సమంతని ఆమె మరిపిస్తుందా లేదా అనేది చూడాలి.