Samantha: టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నారు. అయితే.. ఆమె సోషల్ మీడియాలో తన ఆరోగ్యం, అభిమానులతో ముచ్చట్లు, సినిమాలపై అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. స్వలింగ సంపర్కుల జీవితం.. సమాజం తీరు కథాంశంతో మలయాళంలో మమ్ముట్టి (Mammootty) -జ్యోతిక (Jyothika) నటించిన కాథల్-ది కోర్ (Kaathal – The Core) సినిమాపై స్పందించారు.
‘కాథల్-ది కోర్.. ఈమధ్య కాలంలో నేను చూసిన అద్భుతమైన సినిమా. శక్తివంతమైన కథ ఉంది. అందరూ చూడాల్సిన సినిమా. మమ్ముట్టి నా హీరో. ఇందులో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫీల్ నుంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నాను. మంచి సినిమా చూస్తే వచ్చే ప్రశాంతత ఈ సినిమాతో దక్కింది. లవ్యూ జ్యోతిక’ అని పోస్ట్ చేసింది.
చిత్ర దర్శకుడు జీయోబాబీని లెజెండ్ అని ప్రశంసింది. సమంత పోస్ట్ పై చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్ లో సమంతకు ధన్యవాదాలు తెలిపింది. నవంబర్ 23న విడుదలైన సినిమా ప్రజాదరణ దక్కించుకుంది.