Samantha: సమాజంలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు సమంత. ‘ఇద్దరి వైవాహిక బంధం విచ్ఛిన్నమైతే మహిళలపైనే ఎందుకు ఆంక్షలు విధిస్తారో.. ఎందుకు నిందిస్తారో అర్ధంకాదు. ఇలాంటి సమాజంలో మహిళలు జీవిస్తూండటం అసహనానికి గురి చేస్తోంది. ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొన్న నాపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు’.
‘విడాకులు తీసుకున్నతం మాత్రాన ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్, జీవితం వృధా అయిపోయింద’నే ట్యాగ్స్ మహిళలకే ఎందుకు ఇస్తారో అర్ధం కాదు. ఇవన్నీ మహిళను, ఆమె కుటుంబసభ్యులను ఎంతో బాధిస్తాయి. అదృష్టంకొద్దీ నా స్నేహితులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు నాకు అండగా నిలిచారు. ప్రస్తుతం నేనెంతో సంతోషంగా ఉన్నాను. అనేక సవాళ్లు దాటి ఈ స్థితిలో ఉన్నాను’.
‘విడాకులతోనే నా జీవితం ముగిసిపోలేదు. ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడే మొదలవుతుంది. నా పెళ్లి గౌను రీమోడల్ చేయించడంపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే.. అదేమీ నేను ప్రతీకారం తీర్చుకోవడానికి చేయలేదు. నాకు ఇష్టమైనట్టు నేను చేయించుకున్నా’నని అన్నారు సమంత.